Tata Motors offers: దేశీయ ఆటో మొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కార్ల విక్రయాలు పెంచుకునేందుకు భారీ ఆఫర్లు ప్రకటించింది. గత ఏడాది కొవిడ్ వల్ల ఆశించిన స్థాయిలో విక్రయాలు జరగనందున.. వినియోగదారులను ఆకర్షించేందుకు భారీ డిస్కౌంట్లు ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మోడళ్లను బట్టి రూ.10 వేల నుంచి రూ.60 వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది.


మోడళ్ల వారీగా ఆఫర్లు ఇలా..


సఫారీ 2021 వేరియంట్లపై అదిరే ఆఫర్​..


టాటా ఫ్లాగ్​షిప్ ఎస్​యూవీ అయిన సఫారీపై టాటా మోటార్స్ భారీ ప్రకటించింది. అయితే హారియర్​ మాడల్​లానే సఫారీ కూడా డీజిల్​ వేరియంట్ మాత్రమే. అయితే ఇందులో ఆటో ట్రాన్స్​మిషన్ లేదా మాన్యువల్ వేరింయట్​ను ఎంచుకునే వీలుంది.


ఇక ఆఫర్ విషయానికొస్తే.. రూ.60 వేల వరకు ఈ మోడల్​పై డిస్కౌంట్ ప్రకటించింది టాటా మోటార్స్​. 2021లో విక్రయం వాటికిే ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఎక్ఛేంజ్ బెనిఫిట్స్ కలుపుకుని ఈ ఆఫర్​ పొందొచ్చని తెలిపింది.


ఇక 2022 వేరియంట్ కావాలంటే.. ఎక్స్ఛేంజ్, డిస్కౌంట్ కలిపి రూ.40,000 వరకు తగ్గింపు పొందొచ్చని తెలిపింది టాటా మోటార్స్.


టాటా హారియర్​పై భారీ డిస్కౌంట్​..


టాటా పోర్ట్​ఫోలియోలో మిడ్​సైజ్ ఎస్​యూవీ అయిన హారియర్​ మోడల్​పై కూడా రూ.60 వేల వరకు డిస్కౌంట్ ప్రకటించింది కంపెనీ. ఈ ఆఫర్​ కూడా 2021 స్టాక్ పైనై లభిస్తుంది తెలిపింది.


2022 వేరియంట్​పై రూ.40 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుందని తెలిపింది టాటా మోటార్స్​. ఇదే మోడల్ డార్క్ ఎడిషన్​ పూ20 వేకు వరకు బోనస్​ పొందొచ్చని వివరించింది. కార్పొరేట్ కొనుగోలుదారులకు ఈ బోనస్​రూ.25 వేలుగా తెలిపింది.


టియాగోపై రూ.30 వేలు తగ్గింపు..


ఇటీవలే విడుదల చేసిన టియాగో సీఎన్​జీ వేరియంట్​పై రూ.10 వేల వరగు రివార్డ్​తో పాటు.. రూ.20 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్​ ఇస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇక కార్పొరేట్ కొనుగోలుదారులకు రూ.5 వేలు డిస్కౌంట్ ఇవ్వనుంది.


టిగోర్​పూ రూ.25 వేల వరకు తగ్గింపు..


టాటా సెడాన్ విభాగంలోని టిగోర్​పై కూడా టాటా మోటార్స్ భారీ డిస్కౌంట్ ఇస్తోంది. సీఎన్​జీ వేరియంట్​లకు మినహా ఇతర వేరియంట్లపై రూ.25 వేల వరకు ఈ డిస్కౌంట్ పొందొచ్చని పేర్కొంది.


నెక్సాన్​పై ఆఫర్లు ఇవే..


టాటా కార్లలో ఎక్కువ మంది ఇష్టపడే మోడళ్లలో నెక్సాన్ కూడా ఒకటి ఈ మోడల్​ ఇంజిన్​, సహా ఇతర ఫీచర్లు వినియోగదారులను ఎక్కువగా ఆకర్షిస్తాయి.


ఈ మోడల్​పై ఎక్స్ఛేంజ్ ఆఫర్​ కింద రూ.15 వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది టాటా మోటార్స్​. ఇక కార్పొరేట్ కొనుగోలుదారులకైతే రూ.10 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది.


ఆల్ట్రోజ్​పై ఆఫర్లు ఇలా..


టాటా మోటార్స్ ప్రీమియం హ్యాచ్​బ్యాక్​లలో ఒకటైన ఆల్ట్రోజ్​పై పరిమిత ఆఫర్​ను అందుబాటులోకి తెచ్చింది కంపెనీ. కార్పొరేట్ కొనుగోలు దారులకు మాత్రమే ఈ మోడల్​పై రూ.10 వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది.


Also read: JioBook Laptop Features: త్వరలోనే మార్కెట్లోకి JioBook ల్యాప్ టాప్స్.. వాటి ఫీచర్లు ఏంటో తెలుసా?


Also read: PNB rates: సేవింగ్స్ ఖాతా డిపాజిట్లకు వడ్డీ తగ్గించిన పీఎన్​బీ- కొత్త రేట్లు ఇవే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook