Tata Nexon EV Price and Features: టాటా మోటార్స్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. నెక్సాన్ ఈవీ (Nexon EV)పై లక్ష వరకు తగ్గింపు అందిస్తోంది. గతేడాది తయారు చేసిన కార్లపై ఈ తగ్గింపు ఆఫర్‌ను ప్రకటించింది. Nexon EVని కొనుగోలు చేయాలనుకుంటున్న కస్టమర్లకు MY2023 స్టాక్‌పై కంపెనీ మరిన్ని ప్రయోజనాలను అందిస్తోంది. క్యాష్‌ ఆఫర్‌లు, ఎక్స్‌ఛేంజ్‌ బోనస్‌లు, కార్పొరేట్ బోనస్‌లు, ఇతర డీలర్-ఎండ్ ఆఫర్‌లను ఇస్తోంది. వేరియంట్‌ను బట్టి ఆఫర్ కూడా మారుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Eagle Twitter Review: ఈగల్ ట్విట్టర్ రివ్యూ.. బాక్సాఫీస్‌పై మాస్ మహారాజా దాడి  


నెక్సాన్ ఈవీ (Nexon EV) ఫేస్‌లిఫ్ట్ ఫియర్‌లెస్ MR, ఎంపవర్డ్+LR, ఎంపవర్డ్ MR వేరియంట్‌లపై రూ.50 వేల విలువైన ఆఫర్లను అందిస్తోంది. ఫియర్‌లెస్+MR, ఫియర్‌లెస్+S MR, ఫియర్‌లెస్+LR వేరియంట్‌లపై రూ.65 వేల విలువైన తగ్గింపును ఆఫర్ చేస్తోంది. ఫియర్‌లెస్ LR వేరియంట్‌పై రూ.85 వేల వరకు తగ్గింపు లభిస్తుండగా.. టాప్-స్పెక్ ఫియర్‌లెస్+ S LR మోడల్‌పై లక్ష రూపాయల వరకు ఆఫర్ ప్రకటించింది. 


Nexon EV రెండు పవర్‌ఫుల్ బ్యాటరీల వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 30.2kWh బ్యాటరీతో MR, 40.5kWh బ్యాటరీతో LR ఉన్నాయి. MR లిమిట్ 325 కి.మీ కాగా.. LR లిమిట్ 465 కిలోమీటర్లు ఉంది. 7.2kW AC ఛార్జర్‌ని ఉపయోగించి ఆరు గంటల్లో 10 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. అవుట్‌పుట్ విషయానికి వస్తే.. MR వేరియంట్ 129hp, 215Nm, LR 145hp, 215Nm అవుట్‌పుట్‌ను కలిగి ఉన్నాయి. 


నెక్సాన్ ఈవీ కార్లపైనే కాకుండా.. టాటా డీలర్‌లు ప్రీ-ఫేస్‌లిఫ్ట్ ఎలక్ట్రిక్ SUV కార్లపై కూడా ఆఫర్లు ఉన్నాయి. నెక్సాన్ EV ప్రైమ్‌పై రూ.1.90 లక్షల నుంచి రూ.2.30 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. టాప్-స్పెక్ Nexon EV మ్యాక్స్ రూ.2.80 లక్షల వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నారు. గతేడాది డిసెంబర్‌లో ప్రకటించిన తగ్గింపు కంటే రూ.20 వేల ఎక్కువ కావడం విశేషం.


Nexon EV ప్రైమ్ 129hp ఎలక్ట్రిక్ మోటారు, 30.2kWh బ్యాటరీ ప్యాక్‌తో మార్కెట్‌లోకి వస్తుంది. 312 కి.మీ లిమిట్ వస్తుంది. Nexon EV Max 40.5kWh బ్యాటరీ ప్యాక్‌తో 143hp ఎలక్ట్రిక్ మోటారుతో అందుబాటులో ఉంది. దీని లిమిట్ 437 కి.మీ.


Also Read: YSRCP MP Candidates: వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే.. మూడో స్థానానికి కూడా పోటీతో ఎన్నికలు రసవత్తరం


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter