Tata Nexon EV Price: మహీంద్రా ఎక్స్‌యూవీ 400ని చూసి వణికిపోయిన టాటా.. తగ్గిపోయిన నెక్సాన్ కార్ ధర!
Tata Nexon EV price reduced after Mahindra XUV400 released. మహీంద్రా ఎక్స్‌యూవీ 400 లాంచ్ తర్వాత టాటా కంపెనీ తన నెక్సాన్ ప్రారంభ ధరను తగ్గించవలసి వచ్చింది.
Tata Nexon EV price reduced after Mahindra XUV400 released: మొన్నటివరకు భారతీయ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్‌లో 'టాటా నెక్సాన్'తో పోటీపడే ఎలక్ట్రిక్ కారు ఏదీ లేదు. అయితే మహీంద్రా ఎక్స్‌యూవీ 400 లాంచ్ అయినప్పటి నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మహీంద్రా ఎక్స్‌యూవీ 400 కారు టాటా నెక్సాన్ ఈవీతో పోటీపడుతుంది. ఎక్స్‌యూవీ 400 లాంచ్ తర్వాత టాటా కంపెనీ తన నెక్సాన్ ప్రారంభ ధరను తగ్గించవలసి వచ్చింది. ఇందుకోసం టాటా కంపెనీ కొత్త నెక్సాన్ వేరియంట్‌ను విడుదల చేసింది. ఇది బేస్ వేరియంట్ కాగా.. ధర రూ. 14.49 లక్షలుగా ఉంది.
నెక్సాన్ కొత్త వేరియంట్ - XM. టాటా నెక్సాన్ ఈవీ (XM వేరియంట్) ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, LED DRLలు, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, LED టెయిల్ ల్యాంప్స్, డిజిటల్ TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్ వాచ్ కనెక్టివిటీ, ZConnect కనెక్ట్ చేయబడిన కార్ టెక్ మరియు పుష్-బటన్ స్టార్ట్ సీ యూ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో వెనుక డిస్క్ బ్రేక్ కూడా ఉంటుంది.
టాటా నెక్సాన్ ఈవీ రెండు వెర్షన్లలో అందుబాటులో ఉండనుంది. అవే Nexon EV ప్రైమ్ మరియు Nexon EV మాక్స్. నెక్సాన్ ఈవీ ప్రైమ్ ప్రారంభ ధర రూ. 14.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ధర రూ. 16.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ప్రైమ్ టాప్ వేరియంట్ రూ. 17.19 లక్షలు మరియు మ్యాక్స్ టాప్ వేరియంట్ ధర రూ. 18.99 లక్షలుగా ఉంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ఎలక్ట్రిక్ SUV. ఈ కారు ధర రూ. 15.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 18.99 లక్షల వరకు ఉంటుంది. Nexon మరియు XUV400 యొక్క టాప్ వేరియంట్‌ల ధర సమానంగా ఉంది. దీని కారణంగా పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.
Also Read: ఫాన్స్ అలా పిలుస్తారని ఎంఎస్ ధోనీకి తెలుసు.. అసలు నిజం చెప్పేసిన సురేశ్ రైనా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.