Best Safety Car: ఏ కారు కొనాలన్నా ముందుగా చూడాల్సింది సేఫ్టీ ర్యాంకింగ్ గురించే. ఏ కారైనా సరే మార్కెట్‌లో వచ్చే ముందు సేఫ్టీ ర్యాంకింగ్ దాటుకుని రావల్సిందే. దీనినే క్రాష్ టెస్ట్ అని కూడా అంటారు. గ్లోబల్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్స్ GNCAP ఇప్పుడు టాటా నెక్సాన్‌ను బెస్ట్ ఈవీ ఎస్‌యూవీగా ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మార్కెట్‌లో ప్రతి కారుకు GNCAP ఇచ్చే రేటింగ్ కీలకం. ఇప్పుడీ సంస్థ సేఫ్టీ విషయంలో అంటే అటు పెద్దలకు కావచ్చు పిల్లలకు కావచ్చు టాటా కంపెనీకు చెందిన టాటా నెక్సాన్ ఈవీ ఎస్‌యూవీని అన్నింటికంటే బెస్ట్‌గా డిక్లేర్ చేసింది. ఏకంగా 5 స్టార్ రేటింగ్ ఇచ్చి టాప్‌లో నిలబెట్టింది. GNCAPకు అనుబంధంగా ఇండియాలో BNCAP 2023 అక్టోబర్‌లో ప్రారంభమైంది. ఈ ఏజెన్సీ టాటా నెక్సాన్ ఈవీ ఎస్‌యూవీని క్రాష్ టెస్ట్ చేసి టాప్ రేటింగ్ ఇచ్చింది. టాటా నెక్సాన్ ఈవీ ఎస్‌యూవీకు పెద్దల విషయంలో 30 పాయింట్లకు 29.86 ఇచ్చింది. ఇక పిల్లల ఆక్సుపెన్సీ సేఫ్టీ విషంయోల 49 పాయింట్లకు 44.95 ఇచ్చింది. ఈ స్కోర్లను 5 స్టార్ రేటింగ్ కింద పరిగణిస్తారు. 18 ఏళ్ల పిల్లల సేఫ్టీ విషంయలో 12 పాయింట్లకు 11.95 వచ్చాయి. మూడేళ్ల పిల్లల వి,యంలో 12 కు 12 పాయింట్లు వచ్చేశాయి. 


టాటా నెక్సాన్ ఎస్‌యూవీ సైడ్ పోల్, ఫ్రంట్ ఇంపాక్ట్ టెస్ట్‌లో కూడా మంచి స్కోర్ దక్కింది. ఒకవేళ కారుకు ప్రమాదమైతే ముందుకు కూర్చునేవాళ్లను ప్రమాదం నుంచి ఏ మేరకు కాపాడవచ్చో తెలిపేదే ఈ పరీక్ష. ఇందులో 16 పాయింట్లకు 14.26 దక్కాయి. ఇది గంటకు 64 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు చేసిన పరీక్ష. 


టాటా నెక్సాన్ ఈవీ అనేది నిర్దిష్టమైన సేఫ్టీ టెక్నాలజీతో నిర్మితమైంది. ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్, రివర్సింగ్ కెమేరా విత్ రేర్ పార్కింగ్ సెన్సార్ ఉన్నాయి. 360 డిగ్రీలు వ్యూ సిస్టమ్, టైర్ ప్రెషర్ మోనిటరింగ్ సిస్టమ్, రేర్ డిస్క్ బ్రేక్స్ , ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్ ఉన్నాయి. టాటా నెక్సాన్ ఎస్‌యూవీ ఈవీ ధర 14.49 లక్షల నుంచి 19.49 లక్షల వరకూ ఉంటుంది. ఇందులో 30 కేడబ్ల్యూహెచ్, 40.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. 


Also read: Best MPV Car: పెద్ద ఫ్యామిలీకు సరిగ్గా సరిపోయే చీప్ అండ్ బెస్ట్ 7 సీటర్ కారు ఇదే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook