Tata Nexon vs Maruti Brezza: టాటా నెక్సాన్ వర్సెస్ బ్రిజాలలో ఏది మంచిది, ఏది తక్కువ ధర
Tata Nexon vs Maruti Brezza: ప్రస్తుతం మార్కెట్‌లో ఎస్‌యూవీ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. దేశంలోని మూడు కంపెనీ ఎస్‌యూవీల మద్య పోటీ తీవ్రంగా ఉంది. టాటా మోటార్స్, హ్యుండయ్, మారుతి ఎస్‌యూవీలు ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి.
Tata Nexon vs Maruti Brezza: దేశంలో ఇటీవల టాటా నెక్సాన్ వర్సెస్ మారుతి బ్రిజా మధ్య పోటీ పెరుగుతోంది. టాటా నెక్సాన్ కొత్తగా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లాంచ్ చేసింది. దాంతో మారుతి బ్రిజా వర్సెస్ టాటా నెక్సాన్ పోటీ ఇంకాస్త ఎక్కువైంది. ఈ క్రమంలో మారుతి బ్రిజా, టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ మధ్య అంతరం గురించి తెలుసుకుందాం..
టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ట్రిమ్స్ స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్, ఫియర్ లెస్ అనే నాలుగు లైనప్‌లలో లభిస్తోంది. వేరియంట్లు మాత్రం చాలానే ఉన్నాయి. ధర 8.10 లక్షల నుంచి 12.99 లక్షల వరకూ ఉంటుంది. మార్కెట్‌లో టాటా నెక్సాన్ పోటీ అంతా మారుతి బ్రిజాతో ఎదుర్కొంటోంది. బ్రిజాను అధిగమించేందుకే టాటా మోటార్స్ నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ చేసింది. మారుతి బ్రిజా సబ్ 4 మీటర్ ఎస్‌యూవీ విభాగంలో చాలా గట్టిగా పాతుకుపోయింది. అదే సమయంలో నెక్సాన్ కూడా గట్టిగా పోటీని తట్టుకుంటోంది. గత కొద్దికాలంగా టాటా నెక్సాన్ అమ్మకాలు కూడా ఎక్కువే ఉన్నాయి. నెక్సాన్..బ్రిజా కంటే ధర తక్కువే. ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఇంకా తక్కువని తెలుస్తోంది.
టాటా నెక్సాన్ అనేది బ్రిజా కంటే విలువైంది. ఎంట్రీ లెవెల్ మారుతి బ్రిజా ఎంట్రీ లెవెల్ వేరియంట్ ఇంకా బాగుంటుంది. టాప్ ఎండ్ వాహనం ఇది. కొత్త టాటా నెక్సాన్ ధర 8.10 లక్షల నుంచి ప్రారంభమై..14.14 లక్షలు ఉంటుంది. నెక్సాన్ బేసిక్ వేరియంట్ దాదాపు 19 వేల రూపాయలు తక్కువ. టాప్ వేరియంట్ అయితే బ్రిజాతో పోలిస్తే 1 లక్ష రూపాయలు తక్కువగా ఉంది.
టాటా నెక్సాన్ పెట్రోల్ వేరియంట్ల ధరలు
నెక్సాన్ స్మార్ట్ 8,09,990 రూపాయలు కాగా స్మార్ట్ ప్లస్ ఎస్ ఆప్షన్ 9,09,990 రూపాయలుగా ఉంది. ప్యూర్ ఎస్ ఆప్షన్ ధర 9,69, 990 రూపాయలుంది. ఇక క్రియేటివ్ వెర్షన్ ధర 10,99,00 రూపాయలుంది. క్రియేటివ్ ప్లస్ ఎస్ ఆప్షన్ 11,69,990 రూపాయలుంది. క్రియేటివ్ ఏఎంటీ ధర 11,69,990 రూపాయలుంది. క్రియేటివ్ డీసీఏ మోడల్ ధర 12,19,990 రూపాయలుంది. ఫియర్ లెస్ డీసీఏ వేరియంట్ ధర 12,19,990 రూపాయలుగా ఉంది.
టాటా నెక్సాన్ డీజిల్ వేరియంట్లు
టాటా నెక్సాన్ డీజీల్ వెర్షన్ ప్యూర్ ధర 10,99,990 రూపాయలుంది. క్రియేటివ్ ధర 10,99,990 రూపాయలుగా ఉంది. ఫియర్ లెస్ మోడల్ ధర 10,99,990 రూపాయలుగా ఉంది. ఫియర్ లెస్ ఏఎంటీ 12,99,990 రూపాయలుంది.
Also read: Vande Sadharan Train: సామాన్యులకు వరం 'వందే సాధారణ్'.. ఈ రైలులో ఉండే సౌకర్యాలు ఇవే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook