Tata Punch EV Vs Nexon EV:  ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో నెక్సాన్ ఈవీకి మంచి ఉంది. ప్రస్తుతం దేశంలో ఎక్కువ అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ ఎస్యూవీల్లో ఇది ఒకటి. కానీ ఇప్పుడు నెక్సాన్ కు పోటీగా మార్కెట్లోకి టాటా మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీని  తీసుకువచ్చింది. దీని ఫీచర్లు కూడా నెక్సాన్ రేంజ్ లోనే ఉన్నాయి.  దీని పేరే టాట్ పంచ్ ఈవీ. దీనిని  జనవరి 17న మార్కెట్లోకి విడుదల చేశారు. జనవరి 22 నుంచి ఈ కారు డెలివరీ ప్రారంభమవుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నెక్సాన్ కు, పంచ్ కు తేడా ఇదే..
టాటా పంచ్ ఈవీ ధర రూ. 10.99 లక్షల నుండి రూ. 15.49 లక్షల వరకు ( ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. అయితే, టాటా నెక్సాన్ ఈవీ ధర రూ. 14.74 లక్షల నుండి రూ. 19.94 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. నెక్సాన్ యొక్క  బేస్ వేరియంట్ రూ. 14.74 లక్షలకు అందుబాటులో ఉంది,  ఇది 325 కిమీ కాన్ఫిగరేషన్‌తో వస్తుంటే... అయితే 15.49 లక్షలు టాప్ వేరియంట్ గా గల టాటా పంచ్ 421 కిమీ కాన్ఫిగరేషన్‌తో ప్రయాణిస్తుంది. టాటా పంచ్ ఈవీ బేస్ వేరియంట్ 315 కిమీ రేంజ్ ను ఇస్తుంది. దీని విలువ రూ. 10.99 లక్షలు. తక్కువ బడ్జెట్, ఎక్కువ రేంజ్ కావాలనుకుంటే టాటా పంచ్ కొనుక్కోవడం మంచిది. క్యాబిన్ స్థలం ఎక్కువగా కావాలనుకునే వారు నెక్సాన్ కొనుగోలు చేయడం మంచిది. టాటా మోటార్స్ లో ఐదుగురు వరకు కూర్చోవచ్చు. 


ఫీచర్లు ఇవే..
పంచ్  ఈవీ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో 10.25-అంగుళాల పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో ఎయిర్ ప్యూరిఫైయర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్, సన్‌రూఫ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, ఈఎస్సీ మరియు ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కారులో రెండు బ్యాటరీ ప్యాక్‌లను ఎంచుకోవచ్చు. 25 kWh బ్యాటరీ ప్యాక్ 315 కిమీ పరిధిని (MIDC) ఇస్తుందని.. అయితే 35 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉన్న పంచ్ ఈవీ లాంగ్ రేంజ్ వేరియంట్ 421 కిమీ పరిధిని (MIDC) ఇస్తుందని కంపెనీ పేర్కొంది.


Also Read: Maruti Fronx: మారుతి సుజుకి Fronx మైక్రో SUVపై రూ.1 లక్ష తగ్గింపు..ఇలా GST లేకుండా కొనొచ్చు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter