Tata Safari Modification, One and Only 9 seater car: భారత్‌లో కార్లు, బైకుల మాడిఫికేషన్‌కి మంచి క్రేజ్ ఉంది. కొత్త వాహనాలు కొన్నప్పటికీ.. అందులోనూ తమకు ఇష్టం వచ్చినట్టుగా వాటిని మాడిఫై చేయిస్తుంటారు. ఈ మాడిఫికేషన్స్‌కి ఒక లిమిట్ అంటూ లేదని నిరూపించాడు ఈ టాటా సఫారీ ఓనర్. రెండు టాటా సఫారీ డికోర్ వాహనాలను ఉపయోగించి ఒకే వాహనం కింద తయారు చేశాడు. ఈ కొత్త లుక్ ఎలా ఉందంటే.. ఇలాంటి టాటా సఫారీ వాహనం అనే కాదు.. అసలు ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి హెవీ లోడ్ ప్యాసింజర్ వెహికిల్‌నే ఎప్పుడూ చూడలేదనేంతలా లుక్ మారిపోయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కారు ఇప్పుడు 9 సీటర్‌ కారుగా మారిపోయింది. హెవీ లోడ్‌కి తగినట్టుగానే 6 టైర్లు ఉండేలా వాహనాన్ని మాడిఫై చేశారు. ఈ వాహనం మాడిఫికేషన్ గురించి కారు యజమాని మాట్లాడుతూ.. హ్యామర్ 6x6 చూసిన తర్వాత తనకు ఈ ఐడియా వచ్చిందని.. ఆ స్పూర్తితోనే ఈ కారును తయారు చేశానని చెబుతున్నాడు.


రెండు సఫారీ డికోర్ ఎస్‌యూవీలను కలిపి తయారు చేసిన ఈ అరుదైన టాటా సఫారి వాహనానికి సంబంధించిన వీడియోను ఆటో అడిక్షన్ పిఆర్డీపీ అనే యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశారు. కారు ముందు చూడటానికి టాటా సఫారీ లుక్‌నే పోలి ఉంటుంది కానీ వెనుక భాగం మాత్రం చాలా పెద్దగా ఎక్స్‌పాండ్ చేసి ఉంటుంది. ఇంటీరియర్‌లో పెద్దగా మార్పులు చేయకుండా జాగ్రత్తపడ్డారు. అలాగే సైడ్ ఫేసింగ్ సీట్లు వెనుకవైపున ఇవ్వబడ్డాయి. 



 


మాడిఫికేషన్ తర్వాత ఈ వాహనానికి సఫారీ లడఖ్ అని కూడా పేరు పెట్టారు. అన్నట్టు ఈ సందర్భంగా మీకు మరో విషయం చెప్పాలండోయ్. వాహనాలను రూపురేఖలు మార్చేంతగా మాడిఫై చేయడం అనేది ఇండియాలో నిషేధం. నిబంధనలకు వ్యతిరేకంగా ఇలా మాడిఫై చేసిన వాహనాలను పోలీసులు సీజ్ చేసే ప్రమాదం కూడా ఎక్కువే ఉంటుంది చూడండి. మాడిఫికేషన్ మోజులో పడి రూల్స్ బ్రేక్ చేస్తే ఆ తరువాత ఇబ్బందులు తప్పవు.


ఇది కూడా చదవండి : KIA EV6 Car: ఈ క్రేజీ కారు కొనేవారికి షాకింగ్ న్యూస్


ఇది కూడా చదవండి : Tata Nexon SUV Prices: మారుతి, మహింద్రాలకు చమటలు పట్టిస్తున్న ఎస్‌యూవి.. జనం కళ్లు మూసుకుని కొంటున్న ఎస్‌యూవి కారు ఏదో తెలుసా ?


ఇది కూడా చదవండి : kia EV9 Specs: కొత్త కారు కొంటున్నారా ? కొంచెం ఆగండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook