వ్యాపారం ప్రయివేట్ వ్యక్తుల చేతుల్లో అయితే లాభాల బాట పడుతుంది కాని ప్రభుత్వం చేతిలో మాత్రం ఎప్పుడూ నష్టాల్లో నడుస్తోంది. దీంతో కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మాలని చూస్తోంది. అయితే ప్రజల తమ కష్టనష్టాలు, లాభనష్టాలతోనే క్షణం తీరికలేకుండా గడపడంతో పెట్టుబడుల ఉపసంహరణపై అంత దృష్టి పెట్టలేకపోతున్నారు. దీంతో కేంద్ర నష్టాలతో నడుస్తున్న సంస్థలతో పాటు లాభాల్లో ఉన్న సంస్థలను తెగనమ్ముతూ వచ్చే డబ్బుతో సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున చేపడుతోంది. ఇలా ప్రయివేట్ పరం అవుతున్న సంస్థలను కార్పోరేట్ సంస్థలు కొనుక్కొని లాభాల బాట పట్టిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఎయిరిండియాను కొనుగోలు చేసిన తర్వాత మంచి ఊపు మీద ఉన్న టాటా గ్రూప్  ఇప్పుడు మరో ప్రభుత్వ రంగ సంస్థను హస్థగతం చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది.  ప్రభుత్వ రంగ సంస్థ అయిన నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(ఎన్ఐఎన్ఎల్) కొంటున్నట్లు ప్రకటించింది. టాటా గ్రూప్‌కు చెందిన టాటా స్టీల్ కంపెనీ నీలాచల్ ఇస్పాత్ నిగమ్‌ను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది. త్వరలోనే చివరి నాటికి ఈ ప్రక్రియను పూర్తి అవుతుందని టాటా స్టీల్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ టీవీ నరేంద్రన్ తెలిపారు. టాటా గ్రూప్‌లోని  మా హై వాల్యు రిటైల్ వ్యాపారాలకు ఈ కొనుగులుకు ఈ ఒప్పందం సహకరిస్తుందని తెలిపింది. ఒడిశాలో ఉన్న ఎన్ఐఎన్ఎల్‌లో 93.71 శాతం వాటాను రూ.12,100 కోట్లకు కొనుక్కోనున్నట్లు ప్రకటించింది. త్వరలోనే ఒప్పంద పత్రాలపై సంతకాలు జరుగుతాయమని తెలిపింది.



ఒడిషాలోని  కళింగనగర్‌లో ఉన్న ఈ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ సామర్థ్యం 11 లక్షల టన్నులు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈ సంస్థ నష్టాల్లో నడుస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో రెండేళ్ల కిందట ఈ ప్లాంట్ మూతపడింది. అప్పటికే సంస్థకు రూ.6,600 కోట్లకు పైగా అప్పులు ఏర్పాడ్డాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఓ స్టీల్ ప్లాంట్ ప్రయివేట్ వ్యక్తులకు దక్కడం ఇదే మొదటిసారి కానుంది. అయితే ఉద్యోగులు మాత్రం టాటా గ్రూప్ కొనుగోలుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. టాటా గ్రూప్‌ కొనుగోలుతో తమకు ఉపాధి అవకాశాలు మళ్లీ దక్కుతాయని అంటున్నారు. మేనేజ్‌మెంట్ తప్పిదాలతో నష్టాలు వచ్చేయే కాని తాము చేసింది ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఎవరో ఒకరు కొని సంస్థను తెరిపిస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో కూడా నష్టాల బాటలో నడుస్తున్ ఎయిర్  ఇండియాను రూ.18 వేల కోట్లకు కొనుగోలు చేసింది  టాటా గ్రూప్. ఎయిర్ ఇండియాను దక్కించుకున్న తర్వాత టాటా గ్రూప్‌లో అందులో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. దీంతో క్రమ క్రమంగా ఇప్పుడు ఎయిర్ ఇండియా లాభాల పంట పండిస్తోంది.


also read LIC IPO Opens: ప్రారంభమైన జంబో ఎల్ఐసీ ఐపీఓ


also read Xiaomi 12 Pro 5G Review: Xiaomi 12 ప్రో లాంఛింగ్ సేల్.. అదిరిపోయే ఫీచర్స్ తో!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook