Purchage Tata Tigor CNG Only Rs 86000 on EMI: ప్రస్తుతం దేశంలో మూడవ అతిపెద్ద కార్ల విక్రయ సంస్థగా 'టాటా మోటార్స్' కొనసాగుతోంది. టాటా కంపెనీ హ్యాచ్‌బ్యాక్ నుంచి ఎస్‌యూవీ వరకు అనేక మోడళ్లను కలిగి ఉంది. టాటా మోటార్స్ కూడా సెడాన్ కారును 'టాటా టిగోర్‌'గా విక్రయిస్తోంది. విశేషమేమిటంటే ఈ సెడాన్ సీఎన్‌జీ (Tata Tigor CNG) ఆప్షన్‌లో కూడా అందుబాటులో ఉంది. ఇది 1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ (86PS/113Nm)ని కలిగి ఉంటుంది. ఇది సీఎన్‌జీ కిట్‌తో 73PS మరియు 95Nm ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం టాటా టిగోర్‌ విక్రయాలు బాగానే ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Tata Tigor CNG Features: 


టాటా టిగోర్‌ సీఎన్‌జీ టాప్ వేరియంట్‌లో ఆటోమేటిక్ హెడ్‌లైట్లు, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు, కీలెస్ ఎంట్రీ, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే టాటా టిగోర్‌ సీఎన్‌జీ వెర్షన్‌ను చాలా తక్కువ ధరకు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. బైక్ ధరలోనే.. కేవలం రూ. 86000కే టాటా టిగోర్‌ సీఎన్‌జీ మీ సొంతం అవుతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.


Tata Tigor CNG Price:


ప్రస్తుతం దేశంలో టాటా టిగోర్‌ సీఎన్‌జీ మూడు వేరియంట్లలో (Tata Tigor CNG XM, Tata Tigor CNG XZ, Tata Tigor CNG XZ+) విక్రయించబడుతోంది. ఈ కారు ధర రూ. 7.60 లక్షల నుంచి మొదలై రూ. 8.90 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. మీరు ఈ కారును లోన్‌పై కొనుగోలు చేయాలనుకుంటే.. 86 వేల రూపాయలు చెల్లించి మీ స్వంతం చేసుకోవచ్చు. ఈఎంఐ యొక్క పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


Tata Tigor CNG EMI Calculator: 


టాటా టిగోర్‌ సీఎన్‌జీ బేస్ వేరియంట్ (Tata Tigor XM CNG) ధర రూ. 8.56 లక్షలు. మీరు ఈ వేరియంట్‌ను లోన్‌పై కొనుగోలు చేస్తున్నారని అనుకుందాం. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే.. మీరు మీ ఎంపిక ప్రకారం ఎక్కువ డౌన్ పేమెంట్ ఇవ్వవచ్చు, వివిధ బ్యాంకులలో వడ్డీ రేటు భిన్నంగా ఉంటుంది మరియు లోన్ కాలపరిమితి 1 నుంచి 7 సంవత్సరాల వరకు కూడా ఎంచుకోవచ్చు. ఉదాహరణకు రూ. 86 వేలు (10%) డౌన్ పేమెంట్, వడ్డీ రేటు 10% మరియు 5 సంవత్సరాల రుణ కాలవ్యవధిని మనం ఎంచుకుంటే.. మీరు ప్రతి నెలా రూ. 16363 ఈఎంఐ చెల్లించాలి. లోన్ మొత్తానికి (రూ. 7.70 లక్షలు) అదనంగా రూ. 2.11 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.


Also Read: Shreyas Iyer IPL 2023: కోల్‌కతా నైట్ రైడర్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2023 నుంచి భారత స్టార్ ప్లేయర్ ఔట్!  


Also Read: Virat Kohli Dance: విరాట్ కోహ్లీకి ఏమైంది.. మూడో వన్డేలో వింత ప్రవర్తన! వీడియో వైరల్‌  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి