ట్యాక్స్ సేవింగ్ డిపాజిట్లు బ్యాంకులతో పాటు పోస్టాఫీసులు కూడా అందిస్తున్నాయి. ఇందులో బ్యాంకు డిపాజిట్ల విషయంలో వడ్డీ రేట్లు వేర్వేరుగా ఉంటాయి. ఈ క్రమంగా ట్యాక్స్ సేవింగ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ అందించే టాప్ 3 బ్యాంకులేవో చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ట్యాక్స్ సేవింగ్ డిపాజిట్లలో చాలావరకూ 5 ఏళ్ల కాలవ్యవధికి ఉంటాయి. ఐటీ చట్టం సెక్షన్ 80 సి ప్రకారం ఏడాదికి 1.5 లక్షల వరకూ ట్యాక్స్ డిడక్షన్ ఉంటుంది. ట్యాక్స్ సేవింగ్ డిపాజిట్లు  నెలవారీ లేదా త్రైమాసికంగా వడ్డీ చెల్లిస్తుంటాయి. ఇన్వెస్టర్ వయసు ఆధారంగా ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు రిటర్న్స్ బాగుంటాయి. ట్యాక్స్ సేవింగ్ డిపాజిట్లపై అత్యధిక రిటర్న్స్ అందించే టాప్ 3 బ్యాంకుల గురించి తెలుసుకుందాం..


యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా


నవంబర్, 2022 నుంచి ఈ ప్రభుత్వ రంగ సంస్థ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ప్రస్తుతం 5 ఏళ్ల కాల పరిమితి ఉన్న ట్యాక్స్ సేవింగ్ డిపాజిట్లపై 6.7 శాతం వడ్డీ ఇస్తోంది. సీనియర్ సిటిజన్లకు మరో 5 బేసిస్ పాయింట్లు అదనం. అంటే సీనియర్ సిటిజన్లకు 7.2 శాతం వడ్డీ అందుతుంది.


కెనరా బ్యాంకు


మరో ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకు ట్యాక్స్ సేవింగ్ డిపాజిట్లపై మంచి ఆకర్షణీయమైన వడ్డీ అందిస్తుంది. అక్టోబర్ 31, 2022 నుంచి బ్యాంకు వడ్డీ రేట్లను మార్చింది. 5 ఏళ్ల కాల పరిమితికై ట్యాక్స్ సేవింగ్ డిపాజిట్లపై 6.5 శాతం వడ్డీ కాగా, ఇదే కాలపరిమితి ఫిక్స్డ్ డిపాజిట్ సీనియర్ సిటిజన్లకు 7 శాతం వడ్డీ అందిస్తోంది. కెనరా ట్యాక్స్ డిపాజిట్ స్కీమ్‌పై 6.50 శాతం వడ్డీ ఇస్తుంది. ఇందులో గరిష్టంగా 1.50 లక్ల వరకూ డిపాజిట్‌కు అనుమతి ఉంది. 


ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు


ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ట్యాక్స్ సేవింగ్ డిపాజిట్లపై అత్యధికంగా వడ్డీ అందిస్తోంది. 2022 నవంబర్ 11 నుంచి వడ్డీ రేట్లు రివైజ్ చేసింది ఈ బ్యాంకు. ఐవోబీ ట్యాక్స్ సేవర్ టెర్మ్ వడ్డీ రేటు 6.40 సాతం సాధారణ ప్రజలకైతే..సీనియర్ సిటిజన్లకు 6.90 శాతం అందుతుంది. సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.15 శాతం వడ్డీ లభిస్తుంది. 


Also read: Oneplus: వన్‌ప్లస్ 11, వన్‌ప్లస్ 11R లాంచ్ డేట్ ఎప్పుడు, ప్రత్యేకతలేంటి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook