TDS Filing Date: టీడీఎస్ ఫైల్ చేసేందుకు గడువు తేదీని పెంపు, ఎప్పటిలోగా ఫైల్ చేయాలంటే
TDS Filing Date: మీరు ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారా, చేయకపోతే మీ కోసం మరో అవకాశం మిగిలుంది. టీడీఎస్ ఫైల్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గడువు తేదీని పెంచింది. ఆ వివరాలు మీ కోసం..
ఉద్యోగి లేదా వ్యాపారి ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఎప్పటికప్పుడు ఫైల్ చేస్తుండాలి. లేకపోతే లేనిపోని ఇబ్బందులు ఎదురౌతాయి. మీరు టీడీఎస్ ఫైల్ చేయకపోతే ఇప్పుడు మీకు మరో అవకాశం మిగిలుంది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ రెండవ త్రైమాసికానికి సంబంధించి త్రైమాసిక టీడీఎస్ ఫైల్ చేసేందుకు గడువు తేదీని మరోసారి పెంచింది. అక్టోబర్ 31 గడువు తేదీని..ఇప్పుడు నవంబర్ 30వ తేదీకు పొడిగించింది. ఫారమ్ 26 క్యూ ఫైల్ చేసేటప్పుడు ఎదురౌతున్న సమస్యల్ని దృష్టిలో ఉంచుకుని..టీడీఎస్ ఫైలింగ్ తేదీని పెంచింది.
ఫారమ్ 26 క్యూని టీడీఎస్ త్రైమాసిక రిటర్న్స్ వివరణ ఇచ్చేందుకు సమర్పిస్తారు. ఈ ఏడాది 2022-23 జూలై-సెప్టెంబర్ త్రైమాసికం కోసం ఫామ్ సమర్పించేందుకు చివరి తేదీని ఇప్పుడు మరో నెల పొడిగించింది సీబీడీటీ. మరోవైపు కంపెనీలు ఫైల్ చేసే ఐటీఆర్ గడువు తేదీని నవంబర్ 7 వరకూ పెంచింది. అంటే మరో వారం రోజులు గడువు పెరిగింది. అటు ఆడిట్ రిపోర్ట్ దాఖలు చేసే గడువు తేదీ కూడా పెరిగింది.
ప్రస్తుతం 2022-23 కోసం సెక్షన్ 139 క్లాజ్ 1 ప్రకారం ఆదాయపు వివరాలు సమర్పించే గడువు తేదీని పెంచారు. మొన్నటివరకూ చివరి తేదీ అక్టోబర్ 31గా ఉంది.ఇప్పుడు మరో వారం రోజులు పొడిగించారు. అంటే నవంబర్ 7 వరకూ టీడీఎస్ ఫైల్ చేసుకునే అవకాశం లభించింది. కంపెనీలు 2021-22 ఆర్ధిక సంవత్సరానికి తమ ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ అక్టోబర్ 31, 2022 లోగా సమర్పించడం తప్పనిసరి. ఇప్పుడీ కంపెనీలు నవంబర్ 30, 2022 వరకూ రిటర్న్స్ దాఖలు చేసుకోవచ్చు.
Also read: Share Market: భారీగా పతనమైన ఆ కంపెనీ షేర్, తీవ్రంగా నష్టపోయిన ఇన్వెస్టర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook