Hyderabad Real Estate : తెలంగాణలో రియల్ బూమ్ బూమ్..సీఎం రేవంత్ తీసుకునే ఈ నిర్ణయంతో పండగే..!!
Telangana Real Estate: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టే వారికి ఇది ఒక రకంగా శుభవార్త అనే చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల ప్రాపర్టీ వేల్యూ భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణలోని భూములు, ఖాళీ స్థలాలు, నివాస గృహాలకు సంబంధించిన మార్కెట్ విలువను పెంచాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఓపెన్ మార్కెట్ విలువ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Land Rates : రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అది హైదరాబాద్ లో అయితే మీకూ గుడ్ న్యూస్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో ప్రాపర్టీ వ్యాల్యూ భారీగా పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉన్న భూములు, ఖాళీ స్థలాలు, నివాస గృహాలకు సంబంధించిన మార్కెట్ వ్యాల్యూని పెంచాలని ఇప్పటికే సర్కార్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఓపెన్ మార్కెట్ విలువ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దీనికి సంబంధించిన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామాలు ప్రాంతాలవారీగా నివేదికలు సైతం సిద్ధం చేసినట్లు సమాచారం అందుతుంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇప్పటికే సమీక్ష చేసి అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ అనుమతి గనుక లభించినట్లయితే ప్రాపర్టీ విలువ పెరిగే అవకాశం ఉంటుందని రియల్ ఎస్టేట్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం కమర్షియల్, నాన్ కమర్షియల్ ప్రాతిపదికన ప్రాపర్టీలను విభజించిన అనంతరం వాటికి మార్కెట్ వాల్యుని నిర్ణయించాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా గతంలో నాన్ కమర్షియల్ ఏరియా గా ఉండి ప్రస్తుతం కమర్షియల్ ఏరియా ఎదిగిన ప్రాంతాలను గుర్తించి వాటి వాల్యూను పెంచేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే భూమిలో అపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ వేల్యూ ని కూడా పెంచేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. దీని ద్వారా ప్రభుత్వానికి అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది.
Also Read : Anti Aging Tips: 40ఏళ్ల వయస్సులోనూ 20ఏళ్లలా కనిపించాలా?అయితే ఈ ఫుడ్స్ తినండి..!!
ప్రస్తుతం ఓపెన్ ప్లాట్ లకు సంబంధించి రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువ అలాగే ఓపెన్ మార్కెట్లో ఉన్న వ్యాల్యూను రెండింటిని బేరీజు వేసి ఆ తర్వాతే మార్కెట్ ధరను పెంచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఓపెన్ మార్కెట్ విలువలో ఇది 50% నుంచి మార్కెట్ విలువ పెంచకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఒక సమాచారం అందుతుంది.
ఇక అపార్ట్మెంట్ వాల్యూ కూడా మార్కెట్ వాల్యూ కన్నా 20 నుంచి 35% వరకు పెరిగే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. ఆగస్టు 15 అనంతరం కొత్త మార్కెట్ ధరలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాల్లో ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది. అయితే ధరల మార్పు తర్వాత ఎవరైతే తమ ప్రాపర్టీని విక్రయించాలనుకుంటారో వారు భారీగా లాభపడే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇప్పటికే ప్రతిపాదించిన రీజినల్ రింగ్ రోడ్డు కనుక వేగం పుంజుకుంటే మాత్రం, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీగా భూముల ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read :Home Lones: ఈ బ్యాంకులో హోంలోన్ తీసుకుంటే EMI టెన్షన్ ఉండదు..ఆ బ్యాంకుల లిస్టు ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి