CNAP Feature: ఇటీవలి కాలంలో స్పామ్ కాల్స్ బెడద ఎక్కువైపోయింది. ఏవేవో నెంబర్ల నుంచి ఫోన్లు వస్తుంటాయి. ట్రూ కాలర్ వంటి ధర్డ్ పార్టీ యాప్‌లు కూడా ఒక్కోసారి పూర్తి వివరాలు ఇవ్వలేకపోతుంటాయి. ఈ అన్ని సమస్యలకు ట్రాయ్ చెక్ పెట్టనుంది. టెలీకం అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త ఫీచర్ ప్రవేశపెడుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టెలీకం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ కొత్తగా కాలింగ్ నేమ్ ప్రజంటేషన్ ఫీచర్ తీసుకొస్తోంది. అన్ని టెలీకం కంపెనీలు విధిగా పాటించాలని ఆదేశాలు అందించింది. జూలై 15 నుంచి కొత్త ఫీచర్ అందుబాటులో రానుంది. అంటే ఇకపై ట్రూ కాలర్ అవసరం లేకుండానే మీకు ఎవరు ఫోన్ చేస్తున్నారో కచ్చితంగా తెలుసుకునే వీలుంది. కాలింగ్ నేమ్ ప్రజంటేషన్‌ను స్థూలంగా సీఎన్ఏపీగా పిలుస్తారు. ఈ ఫీచర్ ప్రకారం సిమ్ కార్డు కొనుగోలు సమయంలో సమర్పించిన ధృవపత్రాల్లోని వివరాలు కాలింగ్ సమయంలో ఇతరులకు కన్పిస్తాయి. అంటే ఎవరు ఫోన్ చేస్తున్నారో కచ్చితంగా తెలుసుకోవచ్చు. 


ఈ ఫీచర్‌ను అమలు చేయాల్సిన టెలీకం ఆపరేటర్లు తొలుత సుముఖత వ్యక్తం చేయలేదు. సాంకేతిక సమస్యలుంటాయని అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. కానీ ప్రభుత్వం, ట్రాయ్ ఒత్తిడితో ముంబై, హర్యానాలో కాలింగ్ నేమ్ ప్రజంటేషన్ సేవల్ని ప్రయోగాత్మకంగా నిర్వహించాయి. దాంతో ఈ నిర్ణయం అమలు చేసేందుకు నిర్ణయించారు. జూలై 15 నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకురావాలని ట్రాయ్ ఆదేశించింది. 


ఇక నుంచి ఫోన్‌లో సేవ్ చేయని నెంబర్ల వివరాలు కూడా తెలిసిపోనున్నాయి. ట్రూ కాలర్ యాప్‌లో అయితే ఓ నెంబర్‌ను ఎక్కువమంది ఏ పేరుతో సేవ్ చేసుకున్నారో అదే కన్పిస్తుంది. కొన్ని నెంబర్లు వివరాలు తెలియవు. కానీ సీఎన్ఏపీ ఫీచర్ ప్రకారం సిమ్ కార్డు ఏ పేరుతో రిజిస్టర్ అయిందో ఆ పేరు డిస్‌ప్లే అవుతుందని తెలుస్తోంది. దీంతో స్పామ్ కాల్స్ బెడదకు దాదాపుగా చెక్ పెట్టవచ్చు. మరో వారం రోజుల్లో అంటే జూలై 15 నుంచి కొత్త సేవలు అందుబాటులో రానున్నాయి. 


Also read: Bajaj CNG Bike Pics: ప్రపంచంలో మొదటి సీఎన్జీ బైక్, ఫుల్ ట్యాంక్ చేస్తే ఢిల్లీ టు షిమ్లా పోవచ్చు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook