EPF: ఈపీఎఫ్ ఖాతాదారులకు అలెర్ట్.. మరికొన్ని గంటలే సమయం.. అప్డేట్ చేయకపోతే అంతే సంగతి!
EPFO: ఆధార్ ఆధారిత OTPని ఉపయోగించి ఉద్యోగుల యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) యాక్టివేట్ అయ్యేలా చూడాలని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)ని ఆదేశించింది.
EPFO UAN: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేసింది. సభ్యులైన ఉద్యోగులందరూ ఆధార్ ఆధారిత ఓటీపీ వ్యవస్థ ద్వారా తమ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ను యాక్టివేట్ చేసుకోవాలని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు యాజమాన్యాలతో కలిసి వ్యూహాత్మకంగా పనిచేయాలంటూ ప్రభుత్వం సూచించినట్లు ఈపీఎఫ్ఓ ఓ ప్రకటనలో వెల్లడించింది. సమర్థవంతమైన అమలు కోసం ఈఫీఎఫ్ఓ జోనల్ ప్రాంతీయ కార్యాలయం ఇందులో పాలు పంచుకుంటాయి. 2024-25 యూనియన్ బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించిన ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం అమల్లో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం.
ఆధార్ చెల్లింపు వ్యవస్థ ద్వారానే అన్ని సంక్షేమ స్కీములను లబ్దిదారులను అందించే క్రమంలో వంద శాతం బయోమెట్రిక్ ఆధార్ ప్రమాణీకరణలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని శాఖలకు ఆదేశాలను జారీ చేసింది. ఆధార్ ను గుర్తింపు పత్రంగా ఉపయోగించడం డెలివరీ ప్రక్రియ సులభం అవుతుందని పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మొదటి దశలో యాజమాన్యాలు ప్రస్తుత ఆర్ధిక ఏడాదితో చేరిన తమ ఉద్యోగులందరికీ నవంబర్ 30 నాటికి ఆధార్ ఆధారిత ఓటీపీ ద్వారా యూఏఎన్ యాక్టివేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఆ తర్వాత మిగిలిన ఉద్యోగులందరికీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
Also read: Inturi Ravikiran: సీఎం చంద్రబాబు ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటా
UANని యాక్టివేట్ చేయడానికి దశల వారీ ప్రక్రియ:
దశ-1: ముందుగా EPFO మెంబర్ పోర్టల్‌కు వెళ్లండి.
దశ-2: ముఖ్యమైన లింక్‌ల క్రింద ఉన్న ఎనేబుల్ UAN ఎంపికపై క్లిక్ చేయండి.
దశ-3: తర్వాతి పేజీలో ఇచ్చిన స్థలంలో మీ UAN నంబర్, ఆధార్ నంబర్, పుట్టిన తేదీ, ఆధార్ లింక్ చేసిన మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.
స్టెప్-4: రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో అందుకున్న OTPని నమోదు చేసి, “అధీకృత పిన్” పొందండి.
స్టెప్-5: ఆధార్ లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌లో నమోదు చేసిన OTPని నమోదు చేయండి. యాక్టివేషన్ తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పాస్‌వర్డ్ వస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.