Budget 2025-26: వచ్చే ఆర్థిక ఏడాది 2025 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్ ప్రవేశపెట్టేందుకు రెడీ అయ్యారు. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్న ఎనిమిదవ బడ్జెట్ ఇది. బడ్జెట్ రూపకల్పనలో ఆర్థిక శాఖ కార్యదర్శి తుహిన్ కాంత పాండే తో పాటు కీలక అధికారులు అవిశ్రాంతంగా పనిచేశారు. రూ. 50 లక్షల కోట్లపై చిలుకు విలువ గల బడ్జెట్ను సిద్ధం చేశారు.  అయితే పతనం అవుతున్న ఆర్థిక వృద్ధిరేటు, అమెరికా డాలర్ పై రూపాయి మారకం విలువ పతనం, వినియోగ డిమాండ్లో పెరుగుదల, వంటి పలు సవాళ్లను ఈ బడ్జెట్లో పరిష్కరించాల్సి ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధిరేటు నాలుగేళ్ల కనిష్టం 6.4 శాతానికి పడిపోయిందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక అభివృద్ధి రేటు నెమ్మదిస్తుందన్న సందేహాలు కూడా ఉన్నాయి. 2019- 20 లో యావత్ ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేసిన కోవిడ్ మహమ్మారి ప్రభావం తర్వాత అతి తక్కువ ఆర్థిక అభివృద్ధి రేటు నమోదు కావడం ఇదే మొదటిసారి.


Also Read: Budget 2025: సామాన్యులకు శుభవార్త వినిపించనున్న నిర్మలమ్మా... వీటి ధరలు భారీగా తగ్గే ఛాన్స్  


 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ దశల్లో పలు సవాళ్ల నుంచి భారత ఆర్థిక వ్యవస్థను ముందుండి నడిపించారు. వినియోగం, డిమాండ్లో మెరుగుదల, ఆర్థిక వృద్ధిరేటు క్షీణత, భౌగోళిక రాజకీయ అనిశ్చితి, స్తంభించిన ప్రైవేట్ పెట్టుబడులు తదితర సమస్యల నుంచి ఆర్థిక వ్యవస్థను ముందుండి నడిపించారు. ఈ నెలలో ఫారెక్స్  మార్కెట్లో అమెరికా డాలర్ పై రూపాయి మారకం విలువ జీవిత కాలం గరిష్టం 86.7లకు పతనమైంది. వచ్చే ఆర్థిక సంవత్సరము 2025-26 జిడిపిలో ద్రవ్య లోటు 4.5 శాతానికి దిగువకు తేవడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.


 కేంద్ర వార్షిక బడ్జెట్ 2025-26 రూపకల్పనలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు  రెవెన్యూ విభాగం కార్యదర్శి పాండే, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్, వ్యాపార కార్యదర్శి మనోజ్ గోవిల్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ మేనేజ్మెంట్ కార్యదర్శి ఎం నాగరాజు ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరరావు చేయూతనిచ్చారు.



Also Read: Budget Day Stock Market: శనివారం నాడే కేంద్ర బడ్జెట్.. ఆ రోజు స్టాక్ మార్కెట్లు పని చేస్తాయా?  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి