New Rules from February 2021: ఫిబ్రవరి నుంచి అమల్లోకి కొత్త నియమాలు, రూల్స్ ఇవే
These 5 Rules Are Changing From February 2021: నగదు ఉపసంహరణ, ఫాస్టాగ్ తప్పనిసరి లాంటి పలు విషయాలు ఫిబ్రవరి నెల 2021 నుంచి మారనున్నాయి. వీటితో పాటు ఎల్‌పీజీ సిలిండర్ ధరల పెంపు లాంటి విషయాలు సైతం అప్డేట్ కానున్నాయి.
New Rules from February 2021: సామాన్యుల జీవితంలో ప్రభావాన్ని చూపే పలు విషయాలు ఫిబ్రవరి నుండి మారబోతున్నాయి. ఎల్‌పీజీ సిలిండర్ ధరలు, పీఎన్‌బీ ఎటీఎం నగదు ఉపసంహరణ, ఫాస్టాగ్ తప్పనిసరి లాంటి పలు విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఫిబ్రవరి 2021 నుండి అమలుకానున్న కొత్త రూల్స్, విషయాలు ఇలా ఉన్నాయి.
కరోనా వ్యాప్తి కారణంగా రిటైర్ అయిన వారు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO Latest Updates)కు జీవిత ధృవీకరణ పత్రం (జీవన్ ప్రమాన్) సమర్పించడానికి ఫిబ్రవరి 28, 2021 వరకు కాలపరిమితిని పొడిగించారు. ఈపీఎస్ 1995 కింద పింఛను తీసుకునే పింఛనుదారులకు సంబంధించి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది.
Also Read: 7th Pay Commission: ఎల్‌టీసీ అలవెన్స్ చెల్లింపులపై 7వ వేతరణ సంఘం గుడ్ న్యూస్
వాహనాలకు ఫాస్ట్‌టాగ్
ఫిబ్రవరి 15, 2021 నుండి దేశంలోని అన్ని వాహనాలకు ఫాస్ట్‌టాగ్ వాడకం తప్పనిసరి చేస్తున్నారు. డిసెంబర్ 1వ తేదీకి ముందు విక్రయించిన మోటారు వాహనాలు M మరియు N రకాలలో 2021 జనవరి 1 నుండి ఫాస్ట్ ట్యాగ్‌ను రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ తప్పనిసరి చేసింది. కేటగిరీ M మోటారు వాహనం అంటే, కనీసం నాలుగు చక్రాలు ఉండి ప్రయాణీకులను తీసుకెళ్లే వాహనం. ‘N’ రకం వాహనా అంటే.. వస్తువులను మోయడానికి కనీసం నాలుగు చక్రాలు కలిగిన మోటారు వాహనం, ఇది వస్తువులతో పాటు వ్యక్తులను కూడా తీసుకెళ్లవచ్చు
- పంజాబ్ నేషనల్ బ్యాంక్ (Punjab National Bank) యొక్క వినియోగదారులకు 2021 ఫిబ్రవరి 1 నుండి కొత్త ఏటీఎం నిబంధనలు అమలులోకి రానున్నాయి. 01.02.2021 నుండి EMV యేతర ATM మేషీన్ల నుండి లావాదేవీలు బంద్ కానున్నాయి. కేవలం ఈఎంవీ ఏటీఎంల నుండి మాత్రమే పీఎన్‌బీ ఖాతాదారులు నగదు డ్రా చేయగలుగుతారు.
Also Read: SBI MF Retirement Benefit Scheme: మ్యూచువల్ ఫండ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ ప్రారంభించిన SBI
- అంతర్జాతీయ మార్కెట్లలో ముడి రేట్లు ఆధారంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతినెలా మొదటి రోజు ఎల్‌పీజీ ధర(LPG Price Latest News)లను సవరించనున్నాయి. ఈ మేరకు ఇదివరకే ప్రకటన వెలువడింది.
- ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. తొలుత ఫిబ్రవరి 15న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు వాయిదా వేసి, మార్చి 8న మళ్లీ సమావేశం ప్రారంభం కానుంది. చివరగా ఏప్రిల్ 8న సమావేశాలు ముగియనున్నాయి. మధ్యాహ్నం రాజ్యసభ, సాయంత్రం లోక్‌సభలో చర్చ జరగనుంది. ఈ సమావేశాల్లో మరెన్నో కొత్త విషయాలపై కేంద్రం ప్రకటించే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook