Home Loans: ఈ బ్యాంకులో హోంలోన్ తీసుకుంటే EMI టెన్షన్ ఉండదు..ఆ బ్యాంకుల లిస్టు ఇదే..!
Home Loan EMI Calculator: మీరు అతి తక్కువ వడ్డీ రేటుకే హోమ్ లోన్ కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే ఇక్కడ పేర్కొన్న టాప్ 5 బ్యాంకుల్లో అతి తక్కువ వడ్డీ ధరకే గృహ రుణాలు అందుబాటులో ఉన్నాయి. అలాంటి టాప్ 5 బ్యాంకుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Home Loan EMI: ప్రస్తుత కాలంలో ఒక మధ్యతరగతి జీవికి సొంత ఇల్లు అనేది తన జీవితకాలం కల. ఎందుకంటే ప్రస్తుతం పెరిగిన ఖర్చుల దృష్ట్యా నగరాల్లోనూ పట్టణాల్లోనూ సొంత ఇంటి ఆవాసం అనేది ఒక కలగా మిగిలిపోతుంది. పెరిగిపోయిన భూముల రేట్లు మెటీరియల్ ధరల రేట్ల కారణంగా ఇళ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మీరు సంపాదిస్తున్న ఆదాయంలో డబ్బులు మిగిల్చుకొని ఆ మిగిలిన డబ్బుతో పొదుపు చేసి ఆ పొదుపుతో మీరు ఇల్లు నిర్మించాలి అంటే సుమారు 15 నుంచి 20 సంవత్సరాలు పడుతుంది. ఈ లెక్కన మీరు పొదుపు చేసినట్లయితే ఆ పదిహేను 20 సంవత్సరాల తర్వాత ఇళ్ల ధరలు మూడింతలు నాలుగింతలు అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మీరు జీవితకాలంలో పొదుపు చేసి ఇల్లు కొనలేరు అని అర్థం చేసుకోవచ్చు.
ఈ నేపథ్యంలో బ్యాంకులు అతి తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కే అందిస్తున్న గృహ రుణాలతో మీరు మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోవచ్చు. మీరు కనుక హోమ్ లోన్ కోసం ఆలోచిస్తున్నట్లయితే తప్పనిసరిగా పలు ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులు అందిస్తున్న హోమ్ లోన్ ధరలను తనిఖీ చేసుకొని వాటిలో ఎందులో వడ్డీ ధరలు తక్కువగా ఉన్నాయో వాటిలో మీరు లోన్ కోసం అప్లై చేసుకుంటే మంచిది. తద్వారా మీకు ప్రతినెల ఈఎంఐ చెల్లించాల్సిన భారం కాస్త తగ్గుతుంది అన్న సంగతి గుర్తుంచుకోవాలి
తక్కువ వడ్డీ రేట్లకు హోమ్ లోన్‌లను అందిస్తున్న టాప్ 5 బ్యాంకుల గురించి తెలుసుకుందాం:
HDFC బ్యాంక్:
అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన HDFC బ్యాంక్, గృహ రుణాలపై సంవత్సరానికి 9.4 శాతం నుండి 9.95 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది.
SBI:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణ గ్రహీత యొక్క CIBIL స్కోర్ ఆధారంగా 9.15 శాతం నుండి 9.75 శాతం మధ్య వడ్డీని అందిస్తోంది.
ICICI బ్యాంక్:
ఈ ప్రైవేట్ రంగ బ్యాంకు 9.40 శాతం నుండి 10.05 శాతం మధ్య గృహ రుణాలను అందిస్తోంది. శాతం పరిధి నుండి వడ్డీ రేట్ల వద్ద గృహ రుణాలను అందిస్తుంది. ₹35 లక్షల లోపు గృహ రుణాలపై, వ్యాపార యజమానులకు వడ్డీ రేటు 9.40 నుండి 9.80 శాతం మధ్య ఉంటుంది.
అయితే జీతం పొందే వ్యక్తులకు ఇది 9.25 శాతం నుండి 9.65 శాతం మధ్య ఉంటుంది.
కోటక్ మహీంద్రా బ్యాంక్:
ఈ ప్రైవేట్ రంగ బ్యాంకు కార్మిక వర్గానికి 8.7 శాతం, వ్యాపారవేత్తలకు 8.75 శాతం చొప్పున గృహ రుణాలను ఇస్తోంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్:
పంజాబ్ నేషనల్ బ్యాంక్ CIBIL స్కోర్, లోన్ మొత్తం , లోన్ కాలవ్యవధి ఆధారంగా 9.4 శాతం నుండి 11.6 శాతం మధ్య గృహ రుణాలపై వడ్డీని వసూలు చేస్తోంది. ఉదాహరణకు, 800 , అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న రుణగ్రహీత రూ. 30 లక్షల కంటే ఎక్కువ రుణం కోసం అత్యల్ప రేటు 9.4 అందిస్తుంది.
Also Read : Gold Rate Today : భారీగా తగ్గుతున్న బంగారం ధర..శ్రావణమాసంలో రూ.64వేలకు పడిపోయే ఛాన్స్ ..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి