Credit card: క్రెడిట్ కార్డుతో క్యాష్ విత్ డ్రా చేస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే భారీగా నష్టపోవడం ఖాయం
Credit card: ఎమర్జెన్సీ సమయాల్లో క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకున్నారా... అయితే ఇలా చేయడం ఎంతవరకు సబబు దీనివల్ల కలిగే నష్టాలు అలాగే లాభాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Credit card: అత్యవసర సమయాల్లో మనకు డబ్బు అవసరం ఎక్కువగా ఉంటుంది. ఆసుపత్రి, స్కూల్ ఫీజు, పెళ్లిళ్లు ఇలా అత్యవసర సమయాల్లో డబ్బు చాలా అవసరం పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో, క్రెడిట్ కార్డ్ చాలా సహాయపడుతుంది. పండుగల సీజన్‌లో క్రెడిట్ కార్డ్ కంపెనీలు కూడా అనేక రకాల ఆఫర్‌లను అందిస్తున్నాయి. ఇందులో క్యాష్‌బ్యాక్, రివార్డ్‌లు, పాయింట్లు మొదలైనవి ఉంటాయి. చాలా మంది క్రెడిట్ కార్డ్ నుండి కూడా నగదు విత్‌డ్రా కోసం వాడుతుంటారు. దీనినే క్యాష్ ఇన్ అడ్వాన్స్ అంటారు. అయితే క్రెడిట్ కార్డు నుంచి డబ్బు విత్ డ్రా చేసుకోవడం సరైన పద్ధతేనా కాదా తెలుసుకుందాం.
చాలా సార్లు, డెబిట్ కార్డ్‌లో డబ్బు లేకపోవడం వల్ల, ప్రజలు క్రెడిట్ కార్డ్ నుండి నగదు విత్ డ్రా చేస్తారు. అత్యవసర పరిస్థితుల్లో నగదు అడ్వాన్స్ మీకు ఉపయోగపడుతుంది కానీ మీరు దానిపై ఛార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. మీరు కూడా క్రెడిట్ కార్డ్ నుండి నగదును ఉపసంహరించుకోవాలనుకుంటే, ముందుగా మీరు దానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను తెలుసుకోవాలి.
క్రెడిట్ కార్డ్ నుండి నగదును ఉపసంహరించడం అనేది మీరు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించగలిగే లాస్ట్ ఆప్షన్ మాత్రమే. మీ బ్యాంక్ ఖాతాలో డబ్బు లేకపోతే, క్రెడిట్ కార్డ్ మీకు సహాయం చేస్తుంది. మీ అవసరం మొత్తం తీరిన తర్వాత, లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లించి రుణ విముక్తులు అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వల్ల అవసరమైన సమయాల్లో, మీరు స్నేహితుడి నుండి లేదా బంధువుల నుండి డబ్బు అడగవలసిన పడదు.
క్రెడిట్ కార్డు నుంచి డబ్బు విత్ డ్రా చేస్తే కలిగే ఇబ్బందులు ఇవే:
క్రెడిట్ నుండి నగదును ఉపసంహరించుకునేటప్పుడు, మీరు ముందుగా విత్‌డ్రా చేసిన మొత్తంలో సాధారణంగా 2.5 నుండి 3 శాతం వరకు ఛార్జీని చెల్లించాలి. రూ.1 లక్ష నగదు అడ్వాన్స్ తీసుకుంటే రూ.2-3 వేలు చార్జీ చెల్లించాల్సి రావచ్చు. అంతేకాదు దీనిపై ప్రతి నెలా అధిక శాతం వడ్డీని చెల్లించాలి. ఇలా నగదు అడ్వాన్సులు తీసుకోవడం ద్వారా క్రెడిట్ స్కోర్‌పై నెగిటివ్ ప్రభావం పడతుంది.
మీరు ఎంత నగదు తీసుకోవచ్చు?
ఇది సాధారణంగా కార్డ్ పరిమితి కార్డ్ హోల్డర్ క్రెడిట్ ప్రొఫైల్‌పై ఆధారపడి ఉంటుంది, మీరు ఎంత నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. సాధారణంగా మీరు కార్డ్ పరిమితిలో 20-40 శాతం నగదును విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. వీలైనంత వరకూ క్రెడిట్ కార్డ్ నుండి నగదును తీసుకోకండి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే నగదు అడ్వాన్స్‌ని ఉపయోగించండి అంతేకాదు వీలైనంత త్వరగా తిరిగి కట్టేయండి. లేకపోతే ఇది మీకుగుది బండగా మారే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter