Money: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరి పదేండ్లు పూర్తయ్యింది. ఈ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తోంది. మంత్రివర్గంలో కూడా మహిళా మంత్రులకు  కూడా సమానంగా పదవులు ఇచ్చింది. ఈ క్రమంలోనే మహిళలకు ప్రభుత్వం భారీగా వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లఖ్ పతి దీదీ స్కీం ద్వారాదేశవ్యాప్తంగా 3కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్కీములో భాగంగా మహిళలకు 5లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాన్ని అందిస్తున్నారు. స్వయం సహాయక సంఘాల్లో మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు కేంద్రం లఖ్ పతి దీదీ స్కీంను తీసుకువచ్చింది. ప్రస్తుతం దేశంలో 83 లక్షల మంది స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. 9 కోట్ల మందికిపైగా మహిళలు ఇందులో ఉన్నారు. 


వీళ్లందరికీ రూ. లక్ష నుంచి 5లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తారు. అంతేకాదు లఖ్ పతి దీదీ పథకం ద్వారా మార్కెట్ డిమాండ్  కు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేసేందుకు సాంకేతిక పరిజ్నానం, శిక్షణ కూడా ఇస్తున్నారు. మహిళల వార్షికాదాయాన్ని రూ. 1లక్షల లేదా  అంతకంటే ఎక్కువకు పెంచేందుకు పలు ప్రదేశాల్లో నిర్వహించే డిపార్ట్మెంట్   అవుట్ లెట్లు,  ఫెయిర్లలో వారి ఉత్పత్తులను విక్రయిస్తారు. ఆ ఆదాయాన్ని స్వయం సహాయక సమూహాలకు అందజేస్తున్నారు. 


మహిళలను ఉపాధి కల్పించడం..వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, ఆదాయాన్ని పెంచడం, వారిని స్వయం సమ్రుద్ధి, సాధికారత సాధించడం ప్రభుత్వం లక్ష్యం. మరో మాటలో చెప్పాలంటే ఆర్ధికంగా వెనబడిన మహిళలను ముందుకు తీసుకురావడానికి ప్రభుత్వం లఖ్ పతి దీదీ పథకాన్ని ప్రారంభించింది. 


Also Read: Business Ideas: మీరు కుగ్రామంలో ఉన్నా పర్లేదు..ఈ బిజినెస్ చేస్తే నెలకు రూ. 1 లక్ష సంపాదించడం పక్కా  


లఖ్ పతి దీదీ పథకానికి అప్లయ్ చేసుకోవాలంటే కొన్ని డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి. ఆధార్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం, బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించాలి. వీటితోపాటు మీ మొబైల్ నెంబర్ , పాస్ పోర్టు సైజు ఫోటో కూడా ఇవ్వాలి. స్వయం సహాయక బ్రుందంతో సంబంధం ఉన్న అర్హులైన మహిళలు ఎవరైనా..లఖ్ పతి దీదీ పథకాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళల వయస్సు 18 ఏండ్ల నుంచి 50ఏండ్ల మధ్య ఉండాలి. వార్షికాదాయం రూ. 3లక్షలకు మించకుండా ఉండాలి. 


భారత ప్రభుత్వ అధికారిక వెబ్ సైజ్ కు వెళ్లి లఖ్ పతి దీదీ యోజన ట్యాబ్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేసి అక్కడ మీ వివరాలను సమర్పించాలి. అనంతరం అప్లికేషన్ సబ్‌మిట్ చేయాలి. ఆన్ లైన్ లో కూడా అప్లయ్ చేసుకోవచ్చు. మీ ప్రాంతంలోని సంబంధిత కార్యాలయానికి వెళ్లి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా పాస్ బుక్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్షిప్ సర్టిఫికేట్ వంటి అవసరమైన పత్రాలను జతచేసి లఖ్ పతి దీదీ పథకం దరఖాస్తు ఫారాన్ని అందజేయాలి. 


Also Read: Gold Rates Today: దీపావళి రోజు పసిడి ప్రియుల గుండెల్లో లక్ష్మీ బాంబులా పేలిన బంగారం ధర.. తొలిసారి రూ. 82,000 దాటిన పసిడి  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.