Tiktok vs Youtube: యూట్యూబ్‌కి చెక్ పెట్టేందుకు టిక్‌టాక్ భారీ ప్లాన్స్
Tiktok vs Youtube: చైనీస్ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ యూట్యూబ్‌కి చెక్ పెట్టేందుకు ఓ భారీ ప్లాన్‌ను ముందుకు తెస్తోంది. త్వరలోనే టిక్‌టాక్ వీడియో నిడివిని పెంచనున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది.
Tiktok vs Youtube: గూగుల్ వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌కి షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ పోటీగా మారనుందా.. టిక్‌టాక్ తాజా ప్రకటనతో ఇది నిజమే అనిపిస్తోంది. టిక్‌టాక్ ప్లాట్‌ఫామ్‌పై వీడియో నిడివిని 10 నిమిషాలకు పెంచాలని నిర్ణయించినట్లు ఆ కంపెనీ ప్రకటించింది. గతేడాది జులైలో టిక్‌టాక్‌లో వీడియో నిడివిని 3 నిమిషాలకు పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దాన్ని మరో ఏడు నిమిషాలకు పొడగిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
సోషల్ మీడియా కన్సల్టెంట్, అనలిస్ట్ మాట్ నవరా మాట్లాడుతూ.. వీడియో నిడివి పొడగింపుకు సంబంధించి టిక్‌టాక్ యాప్ ద్వారా కొంతమంది యూజర్స్‌కి నోటిఫికేషన్ అందినట్లు తెలిపారు. అంతేకాదు.. 3-5 నిమిషాల నిడివితో కూడిన వీడియోల అప్‌లోడింగ్‌ని కొంతకాలంగా టిక్‌టాక్ పరీక్షిస్తోందని చెప్పారు. అయితే ప్రస్తుతం ఉన్న వెర్టికల్ ఫీడ్ ఫార్మాట్‌లో నిడివి ఎక్కువగా ఉన్న వీడియోలను వేగంగా స్క్రోల్ చేయడం సాధ్యపడదని.. కాబట్టి టిక్‌టాక్ దీనికోసం ప్రత్యేక ఫార్మాట్‌ను తీసుకొచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
2016లో టిక్‌టాక్ లాంచ్ అయినప్పుడు.. మొదట్లో కేవలం 15 సెకన్ల నిడివి ఉన్న వీడియోలను అప్‌లోడ్ చేసేందుకే అవకాశం ఉండేది. ఆ తర్వాత అది 60 సెకన్లకు పొడగించబడింది. దీంతో ఎక్కువమంది క్రియేటర్స్ టిక్‌టాక్ వైపు ఆకర్షితులయ్యారు. ఆ తర్వాత వీడియో నిడివిని 3 నిమిషాలకు పొడగించారు. ఇప్పుడు ఏకంగా 10 నిమిషాలకు పొడగిస్తుండటంతో ఇన్‌స్టా రీల్స్‌తో పాటు యూట్యూబ్‌కి ఇది పోటీగా మారుతుందనే వాదన వినిపిస్తోంది.
టిక్‌టాక్‌లో అడల్ట్ కంటెంట్ టీనేజర్స్‌కి చేరకుండా కంటెంట్ రిస్ట్రిక్షన్‌పై కూడా ఆ కంపెనీ ఫోకస్ చేస్తోంది. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి కొన్ని టెస్టింగ్స్ జరుగుతున్నట్లు చెబుతున్నారు.
Also Read: Pending Traffic Challans: ఈ-లోక్ అదాలత్‌కు భారీ స్పందన.. తొలి రోజు ఎంత ఆదాయం సమకూరిందంటే..
Also Read: Amritsar Samosa Vendor: ఈ సమోసా అంకుల్ గొప్పతనానికి జనం ఫిదా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook