Gold Rate Today: బంగారం ధర ఆకాశమే హద్దుగా చెలరేగిపోతోంది. నేడు బంగారం ధర ఏకంగా 77 వేల రూపాయలు దాటింది. దీంతో చరిత్రలోనే తొలిసారిగా బంగారం ధర సరికొత్త రికార్డును సృష్టించింది. సెప్టెంబర్ 26 గురువారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల  పది గ్రాముల బంగారం ధర రూ. 77,020గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70,600గా ఉంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిన్న ఒక రోజుతో పోటీ చేసినట్లయితే బంగారం ధర ఏకంగా 400 రూపాయలు పెరిగింది. బంగారం ధర 77,000 మార్కును తాకడం ఇదే తొలిసారి. బంగారం ధర ఈ రేంజ్ లో పెరగడంతో ఒక్కసారిగా  పసిడి ప్రియులు గగ్గోలు పెడుతున్నారు. అంతర్జాతీయంగా  చూసినట్లయితే బంగారం ధర  కమాడిటీ ఎక్స్చేంజ్ లో భారీగా పెరిగింది. ముఖ్యంగా అమెరికాలో ఒక ఔన్స్  బంగారం ధర  2700 డాలర్లు దాటింది. 


పసిడి ధరలు భారీగా పెరగడం వెనుక అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితుల కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. డాలర్ ధర పతనం అవుతోంది. ఇప్పటికే డాలర్ ధర 9 నెలల కనిష్ట స్థాయికి చేరింది ఈ నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరిగేందుకు ఆస్కారం ఏర్పడింది.  


Also Read: Egg Pudding Recipe: కోడి గుడ్డుతో ఈ స్వీట్ చేసుకొని తింటే.. మీ బంధు మిత్రులు ఆహా ఏమి రుచి అనడం ఖాయం  


ముందుగా ఊహించినట్లుగానే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు తగ్గించినప్పటి నుంచి  పసిడి ధరలు భారీగా పెరగడం ప్రారంభించాయి. ఇందులో భాగంగా బంగారం ధర తొలిసారిగా చరిత్రలోనే కనీవినీ ఎరుగనంత స్థాయిలో 77 వేల మార్కును దాటింది. బంగారం ధరలు పెరిగేందుకు ప్రధానంగా అమెరికా ఫెడరల్ రిజర్వు రేట్లను తగ్గించడం వల్ల, అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్ల పై  రాబడి ఒకసారిగా తగ్గిపోయింది. 


ఫలితంగా పెట్టుబడిదారులు తమ పెట్టుబడిని బంగారం వైపు తరలిస్తున్నారు. దీనికి తోడు పశ్చిమాసియా దేశాల్లో  యుద్ధ వాతావరణం కొనసాగుతోంది.ఇజ్రాయిల్ సైనిక చర్యలతో  అరబ్ ప్రపంచం  మరోసారి యుద్ధం వైపుకు అడుగుపెడుతోంది. దీంతో ప్రపంచ మార్కెట్లపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్ ను సురక్షితమైన  పెట్టుబడి సాధనంగా భావించే బంగారం వైపు తరలిస్తున్నారు.


ఇక ఎవరైతే బంగారం పై పెట్టుబడి పెడుతున్నారో  వారికి ఫిజికల్ గోల్డ్ కన్నా కూడా కేంద్ర ప్రభుత్వం జారీ చేసే సావరిన్ గోల్డ్ బాండ్లపై పెట్టుబడి పెడితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ బాండ్లపై వడ్డీ కూడా జారీ చేస్తుంది. అలాగే పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. పెరుగుతున్న బంగారం ధరపై  వచ్చే లాభాలను అందుకోవడానికి ఇది సరైన మార్గం అని నిపుణులు చెబుతున్నారు.


Also Read: Onion Chutney: కూర ఏం చేయాలో అర్థం కావడం లేదా? టెన్షన్ పడకండి..నిమిషాల్లోనే ఉల్లిపాయ చట్నీ ఇలా చేయండి


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.