2022 June 27th 2022 Gold and Silver Prices In Hyderabad: భారత దేశంలో బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయన్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా బంగారంకు ఉన్న డిమాండ్.. కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో పసిడి నిల్వ, వడ్డీ రేట్లు.. డాలర్ విలువ, వివిధ దేశాల భౌతిక పరిస్థితులు లాంటి చాలా కారణాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతాయి. అయితే పసిడి, వెండికి మహిళలు అధిక ప్రాధాన్యతనిస్తారు కాబట్టి ధరలు పెరిగినా వ్యాపారాలు జోరుగానే కొనసాగుతాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో గత 10 రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. నిన్నటితో పోల్చుకుంటే పసిడి ధర స్థిరంగా ఉంది. సోమవారం (జూన్ 27) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 47,550లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,870లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల తులం బంగారంపై.. 24 క్యారెట్ల ధరపై ఎలాంటి వ్యత్యాసం లేదు. మరోవైపు వెండి ధరలు స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ. 59,800గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే వెండి ధర స్థిరంగా ఉంది. 


దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,550 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 52,870గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 47,550 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,870గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,600గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,920 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,550.. 24 క్యారెట్ల ధర రూ. 51,870గా నమోదైంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ. 47,550 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,870గా ఉంది.


హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 47,550 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,870గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ. 47,550.. 24 క్యారెట్ల ధర రూ. 51,870గా నమోదైంది. ఇక విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.47,550 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,870 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 65,700లుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా రూ. 65,700లుగా ఉంది. 


Also Read: IRE vs IND 1st T20: హుడా మెరుపు ఇన్నింగ్స్‌.. ఐర్లాండ్‌పై భారత్‌ ఘన విజయం!


Also Read: Telangana Weather Forecast: తెలంగాణలో నేడు, రేపుఓ మోస్తరు వర్షాలు!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి