Best Mileage Scooters: ఇండియాలో బైక్స్ కంటే స్కూటీలకు క్రేజ్ ఎక్కువౌతోంది. కారణం ఆడా, మగా తేడా లేకుండా అందరూ నడపగలగడం, లగేజ్ క్యారీ చేసేందుకు వీలుగా ఉండటంతో పాటు గేర్‌లెస్ కావడం. అందుకే దాదాపు అన్ని టూ వీలర్ కంపెనీలు స్కూటీలు లేదా స్కూటర్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. వివిధ రకాల ఫీచర్లతో మార్కెట్‌లో కొత్త కొత్త మోడల్ స్కూటీలు దించుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలి కాలంలో బైక్స్ కంటే స్కూటీలకు ఆదరణ పెరుగుతోంది. అందుకే వీటి ధరలు కూడా  90 వేలకు పైనే ఉంటున్నాయి. సగటున 1 లక్ష రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. యమహా, హీరో, హోండా, టీవీఎస్, వెస్పా ఇలా చాలా కంపెనీలు వివిధ రకాల స్కూటీలు మార్కెట్‌లో ప్రవేశపెట్టాయి. ఇవి కాకుండా కేవలం ఎలక్ట్రిక్ మోటార్లతో నడిచే స్కూటీలు చాలా ఉన్నాయి. ఈ క్రమంలో అత్యధిక మైలేజ్ అందించే టాప్ 4 స్కూటీలు ఏంటో తెలుసుకుందాం. ఇవి మార్కెట్‌లో ఆదరణ సంపాదించుకున్న స్కూటీలు. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లో, నగరాల్లో ఎక్కడ చూసినా ఇవే కన్పిస్తుంటాయి.


Yamaha Fascino 125 Hybrid


యమహా లాంచ్ చేసిన హైబ్రిడ్ స్కూటర్ ఇది. మార్కెట్‌లో క్రేజ్ ఎక్కువగా ఉంది. 125 సిసి ఇంజన్‌తో వస్తోంది. కొత్తగా ఎలక్ట్రిక్ మోటార్ కనెక్ట్ చేసి హైబ్రిడ్ మోడల్ ప్రవేశపెట్టారు. అంటే ఎలక్ట్రిక్ మోటారుతో పాటు పెట్రోల్‌పై కూడా నడుస్తుంది. యమహా కంపెనీ మేన్యువల్ ప్రకారం 68 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. స్కూటీల్లో ఇంతటి మైలేజ్ అంటే బహుశా ఇదే కావచ్చు. ఈ స్కూటీ బరువు కూడా ఇతర స్కూటీలతో పోలిస్తే తక్కువే. కేవలం 99 కిలోలుంది. ఈ హైబ్రిడ్ స్కూటర్ ఎక్స్ షోరూం ధర 79,990 వేలుంది. 


Suzuki Burgman Street 125


సుజుకి కంపెనీకు చెందిన ఈ స్కూటర్ ఇండియాలో ఆదరణ పొందింది. 125 సీసీ ఇంజన్‌తో వస్తోంది. ఇందులో 5.5 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. ఎల్లాయ్ వీల్స్, సెల్ఫ్ స్టార్ట్, కిక్ స్టార్ట్ ఫీచర్లు ఉన్నాయి. యమహా ఫాసినో బరువు 110 కిలోమీటర్లుగా ఉంది. సుజుకి బర్గ్‌మాన్ స్ట్రీట్ 50 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీని ఎక్స్ షోరూం ధర 84 వేల నుంచి 87 వేల వరకూ ఉంది. 


Honda Activa 6G


హోండా కంపెనీకు చెందిన ఈ స్కూటర్ ఎప్పుడూ మొదటి ప్రాధాన్యతగా ఉంటుంది. ఎందుకంటే స్కూటీ విభాగంలో ఇంతగా ప్రాచుర్యం పొందింది ఇదే. అత్యధిక విక్రయాలు నమోదు చేసుకున్న స్కూటీల్లో హోండా యాక్టివా మొదటి స్థానంలో ఉంటుంది. ఇందులో 109.51 సిసి ఇంజన్ ఉంటుంది. 5.3 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. గరిష్ట వేగం 85 కిలోమీటర్లు కాగా 7.73 బీహెచ్‌పి పవర్ జనరేట్ చేస్తుంది. దీని బరువు కాస్త ఎక్కువే. 106 కిలోలుంటుంది. మైలేజ్ అయితే 60 కిలోమీటర్ల వరకూ ఇస్తుంది. దీని ఎక్స్ షోరూం ధర 78  వేల నుంచి 84 వేల మధ్యలో ఉంది. 


TVS Jupiter 125


టీవీఎస్ జూపిటర్ 125 కూడా ఇండియన్ మార్కెట్‌లో బాగా ప్రాచుర్యం పొందిన స్కూటర్. యువత ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటుంది. 125 సిసి ఇంజన్ కలిగి ఉంటుంది. 8.15 బీహెచ్‌పి పవర్, 10.5 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ స్కూటర్ బరువు 108 కిలోలు. దీని ఎక్స్ షోరూం ధర 86 వేల నుంచి 96 వేల మధ్యలో ఉంది.


Also read: iQoo Neo 9S Pro Plus: కళ్లు చెదిరే ఫీచర్లు, 16 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్‌తో iQoo నుంచి కొత్త ఫోన్, ధర ఎంతంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook