February 2022 Bank Holidays: రేపటితో జనవరి నెల ముగియనుంది. ఫిబ్రవరిలో నెల ప్రారంభానికి ముందు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాల్లో బ్యాంక్​ సెలవులు కూడా ఒకటి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్యాంకుల్లో ఏదైనా పని సెలవుల గురించి ముందే తెలుస్తే.. పక్కాగా ప్లాన్ చేసుకోవచ్చు. లేదంటే.. తీరా ప్లాన్ చేసుకున్నాక బ్యాంక్​ సెలవు అని తెలిస్తే.. ఆ పని పెండిగ్​లో పడుతుంది.


ఫిబ్రవరిలో సెలవుల విషయానికొస్తే.. వచ్చే నెలలో మొత్తం 12 రోజులు బ్యాంకులు మూత పడనున్నాయి. ఆదివారం, రెండు, నాలుగు శనివారాల్లో దేశవ్యాప్తగా అన్ని బ్యాంకులు సెలవులో ఉండటం తెలిసిందే. అవి కాకుండా.. వసంత పంచమి, గురు రవిదాస్ జయంతి సందర్భంగా ఫిబ్రవరిలో వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు సెలవులు ఉండనున్నాయి.


ఇక దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో స్థానిక పండుగల సందర్భంగా కూడా బ్యాంకులు సెలవులో ఉంటాయి. అయితే ఈ సెలవులు అనేవి బ్యాంకులను బట్టి కూడా మారుతాయి. జాతీయ స్థాయి హాలిడేస్ అనేవి అన్ని బ్యాంకులకు వర్తిస్తాయి. వీటిని ఆర్​బీఐ నిర్ణయిస్తుంది. కానీ స్థానిక పండుగలకు సెలవులను బ్యాంకులే నిర్ణయిస్తాయి.


ఫిబ్రవరిలో ఏఏ రోజు బ్యాంకులు పని చేయవంటే..


ఫిబ్రవరి 2: సోనమ్ లోచర్​ (సిక్కింలో బ్యాంకులకు మాత్రమే వర్తిస్తుంది)
ఫిబ్రవరి 5: సరస్వతి పూజా, శ్రీ పంచమి, వసంత పంచమి (పశ్చిమ్ బెంగాల్​,ఒడిశా, త్రిపురకు వర్తింపు)
ఫిబ్రవరి 6: ఆదివారం సాధారణ సెలవు
ఫిబ్రవరి 12: రెండో శనివారం సాధారణ సెలవు
ఫిబ్రవరి 13: ఆదివారం సాధారణ సెలవు
ఫిబ్రవరి 15: మహమ్మద్ హజ్రత్ అలీ జయంతి, లుయిస్​-నాగాయ్​-ని (ఉత్తర్​ ప్రదేశ్​, మణిపూర్​లోని బ్యాంకులకు సెలవు)
ఫిబ్రవరి 16: గురు రవిదాస్​ జయంతి (చంఢీగడ్​లో బ్యాంకులకు వర్తింపు)
ఫిబ్రవరి 18: దోల్​జాత్రా​ (పశ్చిమ్ బెంగాల్ వ్యాప్తంగా​ బ్యాంకులకు సెలవు)
ఫిబ్రవరి 19: ఛత్రపతి శివాజీ మహారాజ్​ జయంతి (మహారాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు)
ఫిబ్రవరి 20: ఆదివారం సాధారణ సెలవు
ఫిబ్రవరి 26: నాలుగో శనివారం సాధారణ సెలవు
ఫిబ్రవరి 27: ఆదివారం సాధారణ సెలవు


Also read: రితేష్ దేశ్‌ముఖ్ టు ముకేష్ అంబానీ.. ఇండియాలో ఎంత మంది వద్ద Tesla cars ఉన్నాయో తెలుసా?


Also read: Jio 5G Test Details: 5జి టెస్ట్‌లో దూసుకుపోతున్న జియో, ఏడాది చివరికి ఇండియాలో అందుబాటులో


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook