Toyota Grand Highlander 2023: అమెరికన్ మార్కెట్‌లో ఫుల్‌సైజ్ ఎస్‌యూవీలకు చాలా డిమాండ్ ఉంది. టయోటా గ్రాండ్ హైల్యాండర్ మార్కెట్‌లో చాలా డిమాండ్‌ ఉన్న సంగతి తెలిసిందే..  అయితే ఈ కారు అప్డెట్‌ వేరియంట్‌తో విలాసవంతమైన ఫీచర్లలో మళ్లీ మార్కెట్‌లోకి రాననుంది. దీని విక్రయాలు ఐరోపా దేశాల్లో ఇప్పటికే కొనసాగుతున్నాయి. అయితే ముందు ముందు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్‌లోకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ కొత్త వెర్షన్ టయోటా గ్రాండ్ హైల్యాండర్‌ను చికాగో ఆటో షోలో ప్రదర్శించంది కంపెనీ. ఇక ఈ కారు ఫీచర్ల విషయానికొస్తే పొడవు 5.11 మీటర్లు, వెడల్పు 6 సెం.మీ లతో మార్కెట్‌లో లభించనుంది..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కారు మూడు పవర్‌ట్రెయిన్‌లతో మార్కెట్‌లోకి రాబోతోంది. 265-హెచ్‌పి 2.4 టర్బో-పెట్రోల్‌తో 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ (రెండు లేదా నాలుగు-వీల్ డ్రైవ్), 243-హెచ్‌పి 2.5 పూర్తి హైబ్రిడ్ సివిటి ట్రాన్స్‌మిషన్ (రెండు లేదా నాలుగు-వీల్ డ్రైవ్), కొత్తది ఆరు-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 362-hp, 542 Nm 2.4 హైబ్రిడ్ మాక్స్‌తో మార్కెట్‌లోకి రానున్నాయి. అయితే ఈ కారు మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన డిమాండ్‌ పెరిగిపోయింది.


కొత్త ఇంటీరియర్‌:
ఈ గ్రాండ్ హైల్యాండర్ సరికొత్త స్టైలింగ్, డిజిటల్ ఇంటీరియర్‌తో వినియోగదారులకు లభించనుంది. ఇన్‌స్ట్రుమెంటేషన్ వంటి సరికొత్త ఫీచర్లతో రాబోతోంది. డాష్‌బోర్డ్ మధ్యలో పెద్ద 12.3-అంగుళాల టచ్ స్క్రీన్ కూడా లభించనుంది. అంతేకాకుండా చాలా రకాల ఫీచర్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.


టయోటా గ్రాండ్ హైల్యాండర్ యునైటెడ్ స్టేట్స్‌లో మూడు ట్రిమ్ స్థాయిలలో అందుబాటులో ఉంది. అయితే ఈ ఎస్‌యూవీ త్వరాలోనే భారత మార్కెట్‌లో కూడా లాంచ్‌ చేసే అవకాశాలున్నాయని సమాచారం. ఇప్పటికీ కంపెనీ ఈ ఎస్‌యూవీ విడుదలకు సంబంధించిన సమాచారం మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. 5 నెలల తర్వాత భారత మార్కెట్‌లోకి వచ్చే ఛాస్స్‌ ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.


ఇతర ఫీచర్లు:


  1. గ్రాండ్ హైలాండర్ 265-hp టర్బోచార్జ్డ్ 2.4 గ్యాసోలిన్

  2. 2- లేదా 4-వీల్ డ్రైవ్

  3. 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌

  4. 243-hp 2.5 ఫుల్ హైబ్రిడ్

  5. 542 Nm టార్క్‌

  6. Also Read: Bandla Ganesh Tweets: మీరు వండర్ ఫుల్, మీరే ఇండియా ఫ్యూచర్ కేసీఆర్.. బండ్లన్న ట్వీట్ల వర్షం!


Also Read: Hero Nani Clarity: నాని నోట బూతు పదం.. అసలు సంబంధమే లేదంటున్నాడే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook