సిమ్ కార్డుకు సంబంధించి ఎప్పటికప్పుడు నియమాలు మారుతుంటాయి. అందుకే జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ యూజర్లకు అప్‌డేటెడ్‌గా ఉండాలి. ఇప్పుడు మరోసారి సిమ్ కార్డు రూల్స్ మారాయి. ట్రాయ్ నిబంధనలకు అనుగుణంగా ఈ టెలికం సంస్థలు నిబంధనల్లో మార్పులు చేశాయి. అవేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టెలీకం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫేక్, స్పామ్ కాల్స్ అరికట్టేందుకు తీసుకున్న నిర్ణయం ఇది. ఈ నిర్ణయాన్ని సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయనుంది ట్రాయ్. అంటే మరో 15 రోజుల గడువు మిగిలింది. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే మొబైల్ ఫోన్ వినియోగదారులకు పెద్ద రిలీఫ్ లభించనుంది.మరోవైపు ట్రాయ్ తీసుకున్న ఇంకొన్ని నిర్ణయాలు జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ కంపెనీలకు షాక్ ఇవ్వనున్నాయి. ఈ కొత్త నిర్ణయాలు అందర్నీ ఆశ్చర్యపర్చవచ్చు. 


ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ సహాయంతో ఫేక్, స్పామ్ కాల్స్ గుర్తించి అరికట్టవచ్చు. కానీ ఇది ఆశించిన ప్రయోజనాలు ఇవ్వలేదు. దాంతో ట్రాయ్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ కంపెనీలకు ఆదేశాలిచ్చింది. ఏ నెంబర్ నుంచి ఫేక్ లేదా స్పామ్ కాల్స్ వస్తుంటాయో వాటిపై చర్యలు తీసుకోనుంది. అంటే స్పామ్ కాల్ నెంబర్ కంపెనీ బాధ్యత వహించాలి. ఒకవేళ జియో నెంబర్ నుంచి స్పామ్ కాల్స్ వస్తుంటే జియో బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎయిర్‌టెల్ నుంచి స్పామ్ కాల్స్ వస్తే ఎయిర్‌టెల్ కంపెనీ బాధ్యత వహించాలి. 


ఎవరైనా కస్టమర్ ఫేక్ కాల్ రిపోర్ట్ చేస్తే సంబంధిత టెలికం కంపెనీ వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో ఫేక్ కాల్స్ లేదా స్పామ్ కాల్స్‌పై నేరుగా కంపెనీలు కూడా దృష్టి సారించి అరికట్టాలి. స్కామర్లను కూడా ట్రాయ్ హెచ్చరించింది. 


కాల్స్ చేసే సమయంలో ఏదైనా తప్పుడు సమాచారం ఇస్తే ఆ కాల్  నెంబర్‌ను పేక్ కేటగరీలో ఉంచుతారు. ఇలా ఎవరైనా చేస్తే టెలీకం రెగ్యులేషన్స్ విరుద్ధంగా పరిగణిస్తారు. ఇలాంటివాటిపై కంపెనీ చర్యలు తీసుకుంటుంది. ఎవరైనా టెలీమార్కెట్గింగ్ కోసం ఇలాంటి పనికి పాల్పడితే ఆ నెంబర్లను 2 ఏళ్లు బ్లాక్ లిస్ట్ చేస్తారు. 


Also read: Independence Day Wishes: టాప్ 10 ఇండిపెండెన్స్ డే విషెస్, కోట్స్


మరోవైపు కేంద్ర ప్రభుత్వం 160తో ప్రారంభమయ్యే కొత్త సిరీస్ నెంబర్లకు ప్రవేశపెట్టింది. చాలామంది ప్రైవేట్ నెంబర్ల నుంచి ప్రమోషనల్ కాల్స్ చేస్తున్నారు. ఇప్పుడిక ఇలాంటి వాటిపై నిఘా పెడుతున్నట్టు ట్రాయ్ తెలిపింది. స్పామ్ కాల్స్, ఫేక్ కాల్స్ అరికట్టడమే ట్రాయ్ ఉద్దేశ్యం. అందుకే కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ఎవరైనా ప్రైవేట్ నెంబర్ల నుంచి ప్రమోషనల్ కాల్స్ చేస్తుంటే తక్షణం నిలిపివేయాల్సి ఉంటుంది. 


అంతేకాకుండా సిమ్ కార్డుల ఇ వెరిఫికేషన్‌ను ట్రాయ్ తప్పనిసరి చేసింది. అంటే ఇకపై సిమ్ కార్డు హోల్డర్లు ఇ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఇ వెరిఫికేషన్ లేని సిమ్ కార్డులు హోల్డ్ చేస్తారు. 


Also read: Aadhaar Card Photo Update: ఆధార్ కార్డులో ఫోటో నచ్చలేదా, ఇలా సులభంగా మార్చుకోవచ్చు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook