Truecaller Call Recording: ప్రముఖ కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ Truecaller ఇటీవలే ఓ కీలక ప్రకటన చేసింది. తమ యాప్ ఓ ఫీచర్ ను నిలిపేస్తున్నట్లు అందులో వెల్లడించింది. వచ్చే నెల నుంచి అంటే మే నుంచి వాయిస్ కాల్స్ రికార్డు చేసుకునే సదుపాయాన్ని యాప్ నుంచి తొలగించనున్నారు. ఇదే విషయాన్ని ఆ ప్రకటనలో తెలియజేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Truecaller విడుదల చేసిన కొత్త ప్రకటన ప్రకారం.. మే 11 నుంచి ఆ యాప్ కాల్ రికార్డింగ్ ను కస్టమర్లు చేయలేరు. ఇప్పటి వరకు ఈ సదుపాయాన్ని వినియోగదారులు ఉచితంగా పొందగా.. ఇప్పుడు దాన్ని పూర్తిగా యాప్ నుంచి తొలగించారు. 


రికార్డింగ్ తొలగింపునకు కారణం?


Truecaller యాప్ లో కాల్ రికార్డింగ్ సదుపాయాన్ని ఎందుకు తొలగించారంటే.. Google Play Store కొత్త నిబంధన ప్రకారం ఈ రిమోట్ కాల్ ఆడియో రికార్డింగ్ కు అనుమతి లేదు. దీంతో కాల్ రికార్డింగ్ కు అనుమతి లేని కారణంగా.. ఆ సదుపాయాన్ని Truecaller తొలగించినట్లు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో కాల్ రికార్డ్ చేసుకొవాలనుకునే వారు.. తమ స్మార్ట్ ఫోన్స్ లోని సదుపాయం లేదా ఇతర మూడో పార్టీ యాప్స్ ను వినియోగించవచ్చు. 


Also Read: Flipkart Samsung F22: రూ.549 ధరకే శాంసంగ్ ఎఫ్ 22 కొనేయండిలా!


Also Read: Flipkart Sale: ఫ్లిప్ కార్ట్ లో సూపర్ సేల్.. రూ.559లకే Redmi Note 10T స్మార్ట్ ఫోన్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.