Twitter Character Limit: ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ ఎప్పటికప్పుడు సరికొత్త ప్రకటనలతో వినియోగదారులను ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా ట్విట్టర్ యూజర్లకు మరో గుడ్‌న్యూస్ చెప్పారు. ఇక నుంచి ట్వీట్ల పరిమితిని 10 వేల అక్షరాలకు పెంచారు. మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫాం త్వరలో 'లాంగ్‌ఫార్మ్ ట్వీట్‌లను' 10 వేల అక్షరాలకు పెంచుతుందని ఎలాన్ మస్క్ తెలిపారు. ప్రస్తుతం 280 అక్షరాలు ఉంది. కోడింగ్ సంబంధిత వీడియోను పోస్ట్ చేసిన ఓ యూటుబర్.. "మీరు ట్వీట్లకు కోడ్ బ్లాక్‌లను జోడించగలరా..? అని అడగ్గా.. మస్క్ రిప్లై ఇచ్చారు. తాము త్వరలో 10 వేల లాంగ్‌ఫార్మ్ ట్వీట్‌లకు విస్తరిస్తున్నామని సమాధానం ఇచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఇది అందరూ యూజర్లకు అందుబాటులో ఉండదు. కేవలం బ్లూటిక్ వినియోదారులు మాత్రమే 10 వేల క్యారెక్టర్లను యూజ్ చేసుకోగలరు. బ్లూటిక్ కోసం నెలవారీ చందా వసూలు చేస్తున్న మస్క్.. ఇప్పటికే వారికి కొన్ని ఎక్కువ సదుపాయాలు కల్పిస్తున్నారు. తాజాగా తీసుకున్న నిర్ణయం కూడా బ్లూటిక్ ఉన్నవారికే ఉపయోగపడనుంది.  
 
ట్వీట్ అక్షరాల పరిమితి పెంచాలని వినియోగదారులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. మొదట 140 క్యారెక్టర్లు మాత్రమే ఉండేది. 2017లో 280 అక్షరాలకు పెంచారు. అయినా సరిపోవట్లేదని యూజర్లు కంప్లైట్ చేశారు. మస్క్ చేతిలోకి ట్విట్టర్ వెళ్లిన తరువాత ఆయన అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అక్షరాల పరిమితిపై కూడా నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరిగింది. తాజాగా అందుకు అనుగుణంగా ఆయన నిర్ణయం తీసుకున్నారు.  


ట్విట్టర్‌ను భారీ ధరకు కొనుగోలు చేసిన మస్క్.. ఎలాగైనా లాభాల పట్టించాలని బ్లూటిక్ కోసం సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ తీసుకువచ్చారు. బ్లూటిక్ యూజర్ల నుంచే ఆదాయం వస్తుందని భావిస్తున్న మస్క్.. మొదటి నుంచి వారికి కొన్ని ప్రత్యేక సదుపాయలు కల్పిస్తున్నారు. అయితే ఆయన ఊహించినంతగా యూజర్ల నుంచి బ్లూటిక్ కోసం రెస్పాన్స్ రాలేదు. తాజాగా వారికి 8 వేల అక్షరాలతో ట్వీట్ చేసే సదుపాయం కల్పించింది. ఈ సదుపాయంపై కొందరు వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు ఆగ్రహంతో ఉన్నారు.  


Also Read: Ind Vs Aus: ఆసీస్‌ టీమ్‌కు బ్యాడ్‌న్యూస్.. చివరి టెస్టుకు కెప్టెన్ కమిన్స్ దూరం 


Also Read: MLA Etela Rajender: నిమ్మకునీరు ఎత్తినట్లు కేసీఆర్ తీరు.. ప్రీతిది వ్యవస్థ చేసిన హత్య: ఈటల రాజేందర్   


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook