Types Of Bank Accounts: ఒక వ్యక్తి ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయవచ్చు..? ఎన్ని రకాల ఖాతాలు ఉన్నాయి..?
How Many Bank Accounts in India: ప్రస్తుతం మన దేశంలో దాదాపు ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. దాదాపు 95 శాతం మంది బ్యాంకుల్లో ఖాతాలు ఓపెన్ చేశారు. ఒక వ్యక్తి ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయవచ్చు..? ఎన్ని రకాల బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి..? వివరాలు ఇలా..
How Many Bank Accounts in India: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోఎకి వచ్చిన తరువాత డిజిటల్ ఇండియా వైపు వేగంగా అడుగులు పడ్డాయి. దేశంలో ఎక్కువ మందికి బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయించేందుకు కృషి చేసింది. జన్ ధన్ యోజన కింద దేశంలోని పౌరులందరికీ బ్యాంకు అకౌంట్‌లు ఓపెన్ చేయించుందుకు ప్రయత్నించింది. ప్రస్తుతం దేశంలో 95 శాతం మందికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంక్ అకౌంట్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆర్థిక లావాదేవీలకు బ్యాంక్ అకౌంట్ లేకుంటే పనిజరగదు. బ్యాంక్ ఖాతాల ద్వారా సురక్షితమైన లావాదేవీలు చేయవచ్చు. మనం డబ్బులు జమ చేసుకున్న డబ్బులు కూడా సురక్షితంగా ఉంటాయి.
అయితే బ్యాంక్ ఖాతాలు వివిధ రకాలుగా ఉంటాయి. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్, జాయింట్ అకౌంట్, జన్ ధన్ అకౌంట్ మొదలైన రకాల బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయవచ్చు. సాధారణంగా ఎక్కువ మందికి సేవింగ్స్ అకౌంట్ మాత్రమే ఉంటుంది. సేవింగ్స్ ఖాతాలో జమ చేసిన డబ్బులకు త్రైమాసిక ప్రాతిపదికన వడ్డీ కూడా లభిస్తుంది. బిజినెస్ చేసే వాళ్లు కరెంట్ అకౌంట్లను ఓపెన్ చేస్తారు. ఈ రకమైన అకౌంట్‌లో చాలా లావాదేవీలు ఉంటాయి.
జీతం పొందే వ్యక్తుల కోసం శాలరీ అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఇందులో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయాల్సిన అవసరం లేదు. అయితే వరుసగా మూడు నెలలు జీతం పొందకపోతే.. ఆటోమెటిక్‌గా సేవింగ్స్ అకౌంట్ కింద మారిపోతుంది. ఒక వేళ ఉద్యోగం మారే సమయంలో ఈ అకౌంట్‌ను క్లోజ్ చేసుకోవచ్చు. జాయింట్ అకౌంట్‌లను ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యాపార భాగస్వాములు లేదా భార్యాభర్తలు ఓపెన్ చేయవచ్చు.
ఈ అకౌంట్ ద్వారా అనేక విధాలుగా ప్రయోజనాలు ఉంటాయి. సేవింగ్స్ అకౌంట్‌లో కంటే ఈ ఖాతాలో డబ్బులు పొదుపు చేసుకోవడం ఇంకా సులభం. ఆర్‌బీఐ నిబంధలన ప్రకారం.. ఒక వ్యక్తి ఎన్ని బ్యాంక్ అకౌంట్‌లు అయినా ఓపెన్ చేసుకోవచ్చు. ఇందుకు ప్రత్యేకంగా లిమిట్ అంటూ ఏమి ఉండదు. ఎవరి అవసరాలకు తగినట్లు వారు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook