Aadhaar Update: ఆదార్ కార్డు ఫ్రీ అప్‌డేట్ గడువు పొడిగింపు, ఎలా చేయాలంటే
Aadhaar Update: ఆధార్ యూజర్లకు కీలకమైన అప్‌డేట్. ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు గడువు తేదీని యూఐడీఏఐ మరోసారి పొడిగించింది. మీరింకా పాత ఆధార్ కార్డు వినియోగిస్తుంటే వెంటనే అప్‌డేట్ చేసుకోండి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Aadhaar Update: చాలామంది ఆధార్ కార్డును తీసుకున్న తరువాత అందులో వివరాలు అప్‌డేట్ చేయకుండా వదిలేస్తుంటారు. అడ్రస్ మార్పు, ఫోన్ నెంబర్ మార్చడం, బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలి. అందుకే గడువు తేదీని యూఐడీఏఐ సెప్టెంబర్ 14 వరకూ పొడిగించింది.
ఆధార్ కార్డు ప్రతి పనికీ తప్పనిసరిగా మారుతోంది. ప్రభుత్వం, ప్రైవేటు పని ఏదైనా ఆధార్ కార్డు ఉంటేనే సాధ్యమవుతుంది. అందుకే ఆధార్ కార్డులో వివరాలు పూర్తిగా అప్‌డేటెడ్‌గా ఉండాలి. ఈ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా జూన్ 14 వరకూ అవకాశమిచ్చింది. ఇప్పుడీ గడువును మరో మూడు నెలలకు అంటే సెప్టెంబర్ 14 వరకూ పొడిగించింది. ప్రభుత్వ పధకాలు, బ్యాంక్ ఎక్కౌంట్ ఓపెనింగ్ ఇలా అన్నింటికీ ఆధార్ అవసరమే. ముఖ్యంగా ఫోన్ నెంబర్, బయోమెట్రిక్ వివరాలు తప్పకుండా అప్‌డేట్ చేస్తుండాలి. మీ ఆధార్ కార్డు పదేళ్లు పాతదైతే మాత్రం తప్పకుండా అప్‌డేట్ చేసుకోవాలి. ఎందుకంటే పిల్లలకు అయితే డెమెగ్రఫిక్ డేటా మారిపోతుంది. ఫోన్ నెంబర్, బయోమెట్రిక్, ఫోటో మార్పు కోసం ఎలాంటి ధవృపత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. అడ్రస్ మార్పు, పేరులో తప్పులు మార్చేందుకు మాత్రం ప్రూఫ్ సమర్పించాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ విధానంలో ఆధార్ అప్‌డేట్ ఇలా
ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ https://myaadhaar.uidai.gov.in/ ఓపెన్ చేయాలి. మీ రిజిస్టర్ ఫోన్ నెంబర్‌కు వచ్చే ఓటీపీతో ధృవీకరించుకోవాలి. ఆ తరవాత అవసరమైన సమాచారం ఎంటర్ చేయాలి. అందుకు అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి సబ్మిట్ ప్రెస్ చేయాలి. మొత్తం ప్రక్రియ పూర్తయితే 14 అంకెల యూఆర్ఎన్ నెంబర్ వస్తుంది. ఈ నెంబర్ ఆధారంగా మీ ఆధార్ కార్డు అప్‌డేట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
Also read: Chinab Rail Bridge: 8వ వింతగా ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ రైలు వంతెన, త్వరలో రైల్వే సేవలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook