Flipkart iPhone Offers: ఐఫోన్ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఐఫోన్ కొనాలనుకుంటే ఈ శుభవార్త మీకే. ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్. ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యాపిల్ కంపెనీ ఉత్పత్తి అయిన ఐఫోన్ ఒక ప్రస్టేజియస్ సింబల్. అందుకే ఐఫోన్‌పై అందరికీ మక్కువ ఎక్కువే. మీరు కూడా ఐఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే..ఈ గుడ్‌న్యూస్ మీ కోసమే. ఐఫోన్ 13 మినీ మోడల్‌‌పై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. పాత ఫోన్ ఎక్స్చేంజ్, డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్ కలుపుకుంటే చాలా తక్కువ ధరకే లభిస్తుంది. ఐఫోన్ 13 మినీ స్మార్ట్‌ఫోన్..సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డుపై 10 శాతం డిస్కౌంట్ అందిస్తుంది. (Flipkart iPhone 13 mini and other variants on huge discounts and offers)


ఐఫోన్ 13 మినీ 128 జిబి 66 వేల 9 వందలు కాగా, 256 జీబీ 76 వేల 9 వందల రూపాయలుంది. ఇక హైఎండ్ వేరియంట్ 512 జీబీ అయితే 96 వేల 9 వందల రూపాయలుగా ఉంది. అసలు ధరతో పోలిస్తే..భారీ డిస్కౌంట్ లబిస్తోంది. ఏకంగా 16 వేల రూపాయల వరకూ డిస్కౌంట్ పొందవచ్చు.  ఐఫోన్ 13 మినీ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ నుంచి యాక్సిస్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే..5 శాతం అన్ లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఎక్స్చేంజ్‌లో కొనేవారికి 15 వేల 850 రూపాయల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. ఐఫోన్ 13 మినీలోని అన్ని వేరియంట్లపై ఈ ఆఫర్ ఉంది. ఇక ఐఫోన్ స్మార్ట్‌పోన్ 128 జీబీ వేరియంట్ 74 వేల 9 వందల రూపాయలు కాగా, 256 జీబీతో 84 వేల 9 వందల రూపాయలుంది. 512 జీబీతో 1 లక్షా 4 వేల 9 వందల రూపాయలుంది. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై ఈ మోడల్ ఐఫోన్‌కు 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో 5 శాతం క్యాష్‌బ్యాక్ ఉంది. ఎక్స్చేంజ్ ద్వారా అయితే ఏకంగా 18 వేల 850 రూపాయల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. ఐపోన్ 13 ప్రోపై కూడా ఇదే ఆఫర్ వర్తిస్తుంది. ఇక ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌పై కూడా అన్ని డిస్కౌంట్లు కలుపుకుంటే ఎక్స్చేంజ్ ద్వారా 18 వేల 850 రూపాయల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. 


ఇక ఐఫోన్ 13 మినీ స్పెసిఫికేషన్స్ ఓసారి పరిశీలిద్దాం. ఈ స్మార్ట్‌ఫోన్ 5.4 అంగుళాల డిస్‌ప్లేతో ఉంటుంది. 6 కోర్ జీపీయూ, 16 కోర్ న్యూరల్ ఇంజన్‌తో ఏ15 బయోనిక్ చిప్‌తో పనిచేస్తుంది. పింక్, బ్లూ, మిడ్‌నైట్, స్టార్‌లైట్, ప్రొడక్ట్ రెడ్ రంగుల్లో ఉంటుంది. ఐఫోన్ 13లో 6.1 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. అదనంగా 4 కోర్ జీపీయూ ఉంటుంది. ఇక ఐఫోన్ 13 ప్రో అయితే 6.1 అంగుళాల డిస్‌ప్లేతో ఉంటుంది. అదనంగా సియారా బ్లూ, సిల్వర్, గోల్డ్ , గ్రాఫైట్ రంగుల్లో లభ్యమవుతుంది. సూపర్ రెటీనా ఎక్స్ డీఆర్‌ డిస్‌ప్లే ఉంటుంది. ఐ ఫోన్ 13 ప్రో మ్యాక్స్‌లో డిస్‌ప్లే సైజ్ పెరుగుతుంది. 6.7 అంగులాల సూపర్ రెటీనా డిస్‌ప్లే ఉంటుంది. 


Also read: Todays Gold Rate: స్వల్పంగా పెరిగిన బంగారం, దేశంలో వివిద ప్రాంతాల్లో ఇవాళ్టి బంగారం ధరలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook