Budget Expectation: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో సాధారణ బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఈ బడ్జెట్‌లో ఉద్యోగ వర్గాల నుంచి రైతుల వరకు భారీ ప్రకటనలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తి బడ్జెట్ అని నిపుణులు చెబుతున్న నేపథ్యంలో దేశ ప్రజలను ఆకర్షించడానికి భారీ వరాలు కురిపించవచ్చని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా పన్ను శ్లాబ్, ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచడంపై కీలక నిర్ణయాలు ఉంటాయని చెబుతున్నారు. కచ్చితంగా ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచుతారని ఉద్యోగ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈసారి ప్రభుత్వం నుంచి రెండున్నర లక్షల రూపాయల నుంచి మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో ఆదాయపు పన్ను రాయితీ పరిమితిని పెంచితే ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. స్టాండర్డ్ డిడక్షన్ కూడా రూ.50 వేల నుంచి 75 వేల వరకు పెంచవచ్చు. 80సీ కింద అందుబాటులో ఉన్న పెట్టుబడి పరిమితిని పెంచాలని ఉద్యోగుల నుంచి కూడా డిమాండ్ చేస్తోంది. అదేవిధంగా పీపీఎఫ్‌లో డిపాజిట్ చేసే డబ్బు పరిమితిని కూడా పెంచాలని కోరుతున్నారు.  


2020-21 బడ్జెట్‌లో సాంప్రదాయ పన్ను వ్యవస్థకు భిన్నంగా ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా కొత్త పన్ను విధానాన్ని తీసుకుచ్చింది. పాత పన్ను విధానం తక్కువ ఆదాయ వర్గాలకు ఉపయోగపడుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల అన్నారు. మీరు 7-10 మార్గాల్లో  ట్యాక్స్‌ మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ కొత్త పన్ను స్లాబ్‌లో ఎలాంటి మినహాయింపును క్లెయిమ్ చేయలేరు. ఈ విధానంలో పాత పన్ను విధానం కంటే ఎక్కువ పన్ను శ్లాబులు ఉన్నాయి.


కొత్త పన్ను విధానంలో రూ.2.5 లక్షల వరకు ఆదాయం పన్ను మినహాయింపు ఉంది. ఆ తరువాత ఆదాయపు పన్నులో ఏడు వేర్వేరు స్లాబ్‌లు ఉన్నాయి. ఇందులో మీరు 80C, 80D, మెడికల్ ఇన్సూరెన్స్, హౌసింగ్‌లోన్ మొదలైన వాటిపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయలేరు. ఇందులో రూ.15 లక్షల వరకు ఆదాయంపై 25 శాతం, 15 లక్షల పైబడి ఆదాయంపై 30 శాతం పన్ను చెల్లించాలి. కొత్త పన్ను విధానంలో అద్దెపై స్టాండర్డ్ డిడక్షన్ అందుబాటులో ఉంది. ఇది కాకుండా వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం, పీపీఎఫ్ వడ్డీ, బీమా మెచ్యూరిటీ మొత్తం, డెత్ క్లెయిమ్, రిట్రెంచ్‌మెంట్‌పై పొందిన పరిహారం, రిటైర్‌మెంట్‌పై లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ మొదలైన వాటిపై ఆదాయపు పన్ను మినహాయింపు ఉంది.


కొత్త పన్ను విధానంలో ఇలా..


రూ.2.5 లక్షల వరకు ఆదాయం.. 0 శాతం ట్యాక్స్‌ 
ఆదాయం రూ2,50,001 నుంచి 5 లక్షల వరకు.. 5 శాతం ట్యాక్స్‌
 రూ.5,00,001 నుంచి 7.5 లక్షల వరకు.. 10 శాతం ట్యాక్స్
రూ.7 నుంచి  రూ.10 లక్షల వరకు 15 శాతం పన్ను 
రూ.10,00,001 నుంచి అంతకంటే ఎక్కువ ఆదాయంపై 30 శాతం ట్యాక్స్ ఉంది.


Also Read: IND VS NZ: నేడే రెండో వన్డే.. కోహ్లీని ఊరిస్తున్న మరో రికార్డు  


Also Read: Hyper Aadi: 2024లో జనసేన ప్రభుత్వం.. సినిమాటోగ్రఫీ మంత్రిగా హైపర్ ఆది.. పోస్టులు వైరల్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి