కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 5వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ అసాంతం 2024 ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని సాగినట్టు కన్పిస్తోంది. అదే సమయంలో వ్యవసాయ, రైల్వే, ఉపాధి రంగాలకు అధిక ప్రాధాన్యత కన్పించింది. ఎప్పట్నించో ఎదురుచూస్తున్న ఇన్‌కంటాక్స్ మినహాయింపులు ఇవ్వడం ద్వారా మధ్య తరగతి ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసిందని చెప్పవచ్చు. భారతదేశం ప్రపంచంలో 5వ ఆర్ధిక శక్తిగా ఉందని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇన్‌కంటాక్స్‌లో మినహాయింపు


2014 తరువాత తొలిసారిగా ఇన్‌కంటాక్స్ స్లాబ్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త ఇన్‌కంటాక్స్ స్లాబ్‌లో ఇప్పటి వరకూ ఉన్న 5 లక్షల పరిమితిని 7 లక్షలకు పెంచింది. 7 లక్షల ఆదాయం దాటితే 5 రకాల స్లాబ్ ఉంటుంది. 


పాత ఇన్‌కంటాక్స్ విధానంలో 2.5 లక్షల పరిమితిని 3 లక్షల వరకూ పెంచారు. 3-5 లక్షల ఆదాయంపై 5 శాతం ట్యాక్స్ కాగా, 6-9 లక్షల ఆదాయంపై 10 శాతం ట్యాక్స్, 9-12 లక్షల ఆదాయంపై 15 శాతం ట్యాక్స్,  12 నుంచి 15 లక్షల ఆదాయంపై 20 శాతం ట్యాక్స్, 15 లక్షలు దాటితే 30 శాతం పన్ను విధించారు. 


ఇక సేవింగ్ ఎక్కౌంట్ పరిమితిని 4.5 లక్షల నుంచి 9 లక్షల వరకూ పెరిగింది. సీనియర్ సిటిజన్ల సేవింగ్ స్కీమ్ పరిమితి 30 లక్షలకు పెరుగుతుంది. 7.5 శాతం వడ్డీతో మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ పధకం రెండేళ్ల కాలపరిమితికి ప్రారంభం కానుంది. 


ఏవి పెరుగుతున్నాయి, ఏవి తగ్గుతున్నాయి


విదేశాల నుంచి దిగుమతయ్యే రబ్బరుపై ట్యాక్స్ పెంచడంతో టైర్ల ధరలు పెరగనున్నాయి. అదే సమయంలో సిగరెట్ ధరలు మరింత ప్రియం కానున్నాయి. ఇక బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీ పెంచడంతో ఆ రెంటి ధరలు పెరగనున్నాయి. 


ఎలక్ట్రిక్ వాహనాలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో త్వరలో దేశంలో ఈవీ కార్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. అటు టీవీ ప్యానెళ్ల ధరలు తగ్గడంతో టీవీ ధరలు, మొబైల్ ధరలు తగ్గనున్నాయి. దాంతోపాటు కిచెన్ చిమ్మీ ధరలు కూడా తగ్గనున్నాయి. 


రైల్వే, వ్యవసాయ రంగాలకు పెద్దపీట


ఇక రైల్వే రంగానికి అత్యధికంగా 2.40 లక్షల కోట్లు కేటాయించడమే కాకుండా కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి పెద్దపీట వేశారు కేంద్ర బడ్జెట్‌లో. లడఖ్ ప్రాంతంలో 13 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. మిస్టి పథకం ద్వారా మడ అడవుల అభివృద్ధి జరగనుంది. నేషనల్ హైడ్రో గ్రీన్ మిషన్ కోసం 19,700 కోట్లు కేటాయించారు. గిరిజన మిషన్‌కు 10 వేల కోట్లు, వ్యవసాయ రంగానికి 20 లక్షల కోట్లు రుణాల కోసం కేటాయించారు. చిరుధాన్యాల పంటల ప్రోత్సాహకం కోసం గ్లోబల్ మిల్లెట్ హబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. 


దేఖో అప్నా దేశ్ పేరుతో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడమే కాకుండా..దేశవ్యాప్తంగా 50 పర్యాటక ప్రాంతాల్ని గుర్తించి అభివృద్ధి చేయనున్నారు. దేశంలో త్వరలో 157 మెడికల్, నర్శింగ్ కొత్త కళాశాలలు ఏర్పాటు చేయనున్నారు. దేశవ్యాప్తంగా 50 కొత్త ఎయిర్‌పోర్ట్‌లు, పోర్టులు నిర్మితం కానున్నాయి. దేశంలో మౌళిక వసతుల ఏర్పాటుకు 75 వేల కోట్లు కేటాయించారు. రాష్ట్రాలకు వడ్డీ రహిత రుణాల కోసం 13.7 లక్షల కోట్లు కేటాయించారు. 


పాన్‌కార్డు కీలకం


ఆధార్ కార్డు, పాన్‌కార్డును డిజిటల్ లాక్ చేయడంతో పాటు వ్యాపారులకు పాన్‌కార్డును కీలకమైన గుర్తింపు కార్డుగా మార్చనున్నారు. దేశంలో కొత్తగా 3 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. 


Also read: Union Budget 2023: బడ్జెట్ సమయం సాయంత్రం నుంచి ఉదయానికి ఎప్పుడు మారింది, ఎందుకు మార్చారు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook