కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్..ఇవాళ ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 11 గంటలకు తన 5వ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 2024 ఎన్నికలకు ముందు వస్తున్న చివరి సంపూర్ణ బడ్జెట్ ఇదే. ఉద్యోగస్థులు ఇన్‌కంటాక్స్ స్లాబ్‌లో మార్పు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో గూగుల్‌పై వివిధ అంశాల గురించి సెర్చ్ జరుగుతోంది. ఆ సెర్చింగ్ వివరాలు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. బడ్జెట్ అంటే ఏమిటి


బడ్జెట్ అంటే ఏంటి, దాని అర్ధమేంటనే విషయంపై ఎక్కువగా గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. బడ్జెట్ అంటే ఒక ఆర్ధిక సంవత్సరం చివరిలో ప్రభుత్వం సమర్పించే ఆదాయ, వ్యయాల ఖర్చుపై అంచనా. ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకూ ఉంటుంది. బడ్జెట్‌లో ప్రభుత్వ ఆదాయం ఖర్చులు పద్దు వివరాలుంటాయి. ఇందులో అన్ని వర్గాల ఆదాయం, ఇతర కార్యకలాపాల ఖర్చు ఉంటాయి.


2. బడ్జెట్ రకాలు


గూగుల్ అత్యధికం సెర్చ్ చేసే అంశాల్లో బడ్జెట్ రకాలున్నాయి. అంటే బడ్జెట్ ఎన్నిరకాలనే ప్రశ్నను సెర్చ్ చేస్తున్నారు. బడ్జెట్ మూడు రకాలుంటుంది. నికర బడ్జెట్, మిగులు బడ్జెట్, కోత బడ్జెట్. నికర బడ్జెట్‌లో ప్రభుత్వం ఆదాయం, ఖర్చు వివరాలు సమానంగా ఉంటాయి. ఇక మిగులు బడ్జెట్‌లో ప్రభుత్వ ఆదాయం..ఖర్చు కంటే ఎక్కువ ఉంటుంది. చివరిగా కోత బడ్జెట్‌లో ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉంటుంది.


3. బడ్జెట్ ప్రసంగం 2023


గూగుల్‌పై అత్యధికంగా సెర్చ్ అవుతున్న పదాల్లో మూడవ స్థానంలో ఉంది బడ్జెట్ ప్రసంగం 2023. ఎక్కువగా దీని గురించి సెర్చ్ చేస్తున్నారు. నిన్న అంటే జనవరి 31వ తేదీన రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రసంగం బడ్జెట్ ప్రసంగంతో ప్రారంభమైంది. 


4. బడ్జెట్ 2023 తేదీ


గూగుల్‌పై బడ్జెట్ తేదీ గురించి ఎక్కువగా సెర్చ్ జరుగుతోంది. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తన 5వ బడ్జెట్ ప్రవేశపెడుతోంది. ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశం ఉంటుంది. నిన్న ఆర్ధిక సర్వేను ప్రవేశపెట్టారు. 


5. బడ్జెట్ 2023 అంచనాలు


గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ అవుతున్న పదాల్లో ముఖ్యమైంది ఇదే. బడ్జెట్ 2023 ఎక్స్‌పెక్టేషన్స్ పదం ఎక్కువగా సెర్చ్ అవుతోంది. ఇన్‌కంటాక్స్‌లో మార్పు అవకాశాలు, మద్య తరగతి ప్రజల ఆశలు వంటివాటిపై ఎక్కువగా అంచనాలున్నాయి.


Also read: Union Budget 2023 Live updates: మరి కాస్సేపట్లో కేంద్ర బడ్జెట్, సంసద్, దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook