Stock Market: ఇట్స్ బడ్జెట్ టైం...స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
Stock Market:బడ్జెట్ కు ముందు స్టాక్ మార్కెట్ ఆశాజనకంగా ఉంది. ఉదయం 9గంటల సమయంలో సెన్సెక్స్ 75 పాయింట్ల లాభంతో 80, 557 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ 14 పాయింట్లు పెరిగి 24,524 వద్ద ట్రేడ్ అవుతోంది.
Share market: కేంద్రంలో మోదీ సర్కార్ మూడోసారి కొలువుదీరిన తర్వాత మొదటిసారిగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ ఇది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాసేపట్లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. దీంతో సామాన్యులతోపాటు మార్కెట్ కూడా భారీ అంచనాలతో ఉంది.స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఈరోజు శుభదినంగా భావిస్తున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ ఇటీవలి కాలంలో అనేక సార్లు కొత్త పుంతలను తాకింది.
ఈ పరిస్థితుల్లో పూర్తి బడ్జెట్‌పై మార్కెట్ వైఖరి ఎలా ఉంటుందనే దానిపైనే ఉత్కంఠ నెలకొంది.కాగా ఉదయం 9గంటలక సమయంలో సెన్సెక్స్ 75 పాయింట్ల లాభంతో 80,557 వద్ద కొనసాగుతుండగా..నిఫ్టీ 14 పాయింట్లు పెరిగి 24, 524 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 83, 64వద్ద ప్రారంభం అయ్యింది.
ఇక సెన్సెక్స్ 30 సూచీలో అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, ఎం అండ్ ఎం, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఐషర్ మోటార్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా... శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్‌సిఎల్ టెక్, ఒఎన్‌జిసి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, దివీస్ ల్యాబ్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. స్టాక్ మార్కెట్ ప్రారంభమైనప్పుడు, నిఫ్టీలో చేర్చిన 50 స్టాక్‌లలో 40 పైకి ట్రెండ్ కనిపించింది. దాదాపు అన్ని రంగాల సూచీలు కూడా లాభాలతో ప్రారంభమయ్యాయి.
Aslo Read: Union Budget: బడ్జెట్‌లో యువతకు గుడ్‌న్యూస్? కేంద్ర బడ్జెట్‌తో స్మార్ట్ ఫోన్ ధరలు భారీగా తగ్గుదల?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter