New Changes in PPF: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజనల్లో కీలక మార్పులు, ఏప్రిల్ నుంచి కొత్త నియమాలు ఇలా
New Changes in PPF: తక్కువ ఆదాయం కలిగిన గ్రామీణ ప్రాంతాల వారికి సేవింగ్స్ పథకాల ఆవశ్యకత, కలిగే ప్రయోజనాల గురించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తోంది. వివిధ రకాల పథకాలు ప్రవేశపెడుతోంది. పీపీఎఫ్, సుకన్యా సమృద్ధి యోజన అలాంటివే.
New Changes in PPF: స్మాల్ సేవింగ్స్ పథకాలుగా ఉన్న పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజనల్లో కీలకమైన మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమౌతోంది. ఇందులో పెట్టుబడి పెట్టే ప్రక్రియలో కొన్ని మినహాయింపులు ఇచ్చేందుకు ఆలోచిస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఆధార్ కార్డు సహాయంతో...
స్మార్ సేవింగ్స్ పథకంలో మినహాయింపు ఇచ్చేందుకు కారణం ఎక్కువ మందిని ఈ పధకాలవైపు ఆకర్షించడమే. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి ఈ పథకాలప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువమందిని ఈ పథకాలవైపు ఆకట్టుకునేందుకే ఇందులో మినహాయింపులు ఇస్తోంది ప్రభుత్వం. అందుకే పాన్‌కార్డు స్థానంలో ఆధార్ కార్డుతోనే ఇలాంటి స్మాల్ సేవింగ్స్ పథకాలు ప్రారంభించేందుకు వీలు కల్పించవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే దేశంలో ఇప్పటికీ పాన్‌కార్డుల కంటే ఆధార్ కార్డు హోల్డర్లే అత్యధికం.
ఈ మార్పు లేదా మినహాయింపు కారణంగా గ్రామీణ ప్రాంతాల ప్రజల్ని స్మాల్ సేవింగ్స్ పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ప్రోత్సాహన లభిస్తుంది. ఎందుకంటే పాన్‌కార్డు చాలామంది గ్రామీణులు కలిగి ఉండరు. ఈ ఒక్క కారణంతో స్మాల్ సేవింగ్ పథకాలకు దూరం కాకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ మినహాయింపు ఇస్తోంది. పాన్‌కార్డు ఎక్కువగా కలిగి ఉండేది పట్టణ ప్రాంతీయులే.
క్లెయిమ్ ప్రక్రియ కూడా సులభతరం
పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలకు కైవైసీ జనధన్ యోజన ఖాతాల ద్వారా నిర్ధారించనున్నారు. దీంతోపాటు ఇన్వెస్టర్ మరణిస్తే ప్రభుత్వం ఈ పథకాల క్లెయిమ్ ప్రక్రియను సులభతరం చేయనుంది. ఎందుకంటే క్లెయిమ్ ప్రక్రియ కష్టంగా ఉండటం వల్ల ఇప్పటి వరకూ చాలామంది ఇన్వెస్టర్ల మృతి అనంతరం నామినీకు ఇంకా డబ్బు అందలేదు. ఇక నామినేషన్ ప్రక్రియను కూడా సులభతరం చేస్తోంది ప్రభుత్వం.
మార్చ్ నెలతో పూర్తయ్యే త్రైమాసికంలో స్మాల్ సేవింగ్స్ పథకాలపై లభించే వడ్డీపై కూడా ప్రభుత్వం తరపున నిర్ణయం జరగనుంది. ప్రతి మూడు నెలలకోసారి స్మాల్ సేవింగ్స్ పథకాలపై వడ్డీని సమీక్షిస్తుంటారు. ఈ మధ్యన చాలాకాలం నుంచి మార్పు జరగలేదు. ఇప్పుడు ఈపీఎఫ్ ఓ తరపున కూడా వడ్డీ పెంచడంతో స్మాల్ సేవింగ్స్ పథకాలపై వడ్డీను పెంచవచ్చని తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook