Pan & Aadhaar Card Mandatory for PPF, Sukanya Samriddhi Yojana & SCSS: చిన్న పథకాలలో పెట్టుబడిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌), సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలకు సంబంధించి నిబంధనల్లో మార్పు చేసింది. ఇక నుంచి ఈ పథకాల్లో పాన్, ఆధార్ కార్డ్ లేకుండా ప్రయోజనం పొందలేరని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. చిన్న పొదుపు పథకాలను కేవైసీగా పాన్‌ కార్డు వినియోగిస్తామని ఈ నోటిఫికేషన్‌లో పేర్కొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతేకాకుండా ఏదైనా తదుపరి పెట్టుబడి పెట్టేముందు పెట్టుబడిదారులు  మొదట ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నంబర్‌ను సమర్పించాల్సి ఉంటుందని వెల్లడించింది. లిమిట్ కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి కచ్చితంగా పాన్ కార్డు చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పరిమితికి మించి మీరు పాన్ కార్డు లేకుండా పెట్టుబడి పెట్టేందుకు వీలులేదు. అదేవిధంగా పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్ కోసం అకౌంట్‌ ఓపెన్ చేసేటప్పుడు మీకు ఆధార్ కార్డు లేకపోతే.. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ స్లిప్‌ను సమర్పించిన సరిపోతుంది. పెట్టుబడిదారుని 'స్మాల్ సేవింగ్ స్కీమ్' పథకాలతో లింక్ చేయడానికి.. అకౌంట్ ఓపెన్ చేసిన తేదీ నుంచి ఆరు నెలల్లోపు ఆధార్ నంబర్ తప్పకుండా సమర్పించాల్సి ఉంటుంది. 


Also Read: Maa Awara Zindagi Movie Review: మా ఆవారా జిందగీ మూవీ రివ్యూ


స్మాల్ సేవింగ్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఈ పత్రాలు తప్పనిసరి


==> ఆధార్ కార్డు నంబర్ లేదా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ స్లిప్ కచ్చితంగా కావాలి
==> పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు ఉండాలి
==> పాన్ కార్డు తప్పనిసరిగా సమర్పించాలి
==> ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులు సెప్టెంబర్ 30వ తేదీలోపు పాన్ కార్డు, ఆధార్ కార్డు సమర్పించకపోతే.. అక్టోబర్ 1వ తేదీ నుంచి అకౌంట్ బ్లాక్ అవుతుంది.


ప్రస్తుతం పీపీఎఫ్‌ పథకంలో 7.1 శాతం వడ్డీని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌కు 8.2 శాతం వడ్డీని ఆఫర్ చేస్తుండగా.. సుకన్య సమృద్ధి యోజన పథకానికి 8 శాతం వడ్డీని అందజేస్తోంది. ప్రస్తుతం ఎక్కువమంది ఈ పథకాలలో పెట్టుపెడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ పథకాలలో ఇన్వెస్ట్ చేస్తే.. మంచి ఆదాయంతోపాటు పెట్టుబడి పెట్టిన డబ్బు సురక్షితంగా ఉంటుంది. 


Also Read: Aadhaar Card Photo Change: 8 ఏళ్ల బాలుడి ఆధార్‌ కార్డులో డిప్యూటీ సీఎం ఫొటో



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి