Electric Cars: త్వరలో లాంచ్ కానున్న బెస్ట్ టాప్ 4 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
Electric Cars: గత కొద్దికాలంగా ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇంధన ధరలు ఆకాశాన్నంటుతుండటమే కాకుండా హై ఎఫిషియెన్సీతో వస్తుండటంతో అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే కంపెనీలు కూడా ఈవీ కార్లు లాంచ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ ఏడాది మరో 4 ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్ ఎంట్రీ ఇవ్వనున్నాయి.
Electric Cars: ఎలక్ట్రిక్ కార్లకు భారతదేశం అతి పెద్ద మార్కెట్ గా ఉంది. గత కొద్దికాలంగా ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. అందుకే అన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ వెర్షన్లు దింపుతున్నాయి. ఇప్పటికే టాటా మోటార్స్, మహీంద్ర, కియా మోటార్స్, హ్యుండయ్, నిస్సాన్ వంటి కంపెనీలు ఈవీ కార్లు లాంచ్ చేశాయి. ఇప్పుడు మరో 4 ఎలక్ట్రిక్ కార్లు ఈ ఏడాదిలో లాంచ్ కానున్నాయి.
TATA CURVV EV టాటా మోటార్స్ కంపెనీ సైతం ఎంతో అంచనాలు పెట్టుకున్న ఎలక్ట్రిక్ కారు ఇది. మొట్టమొదటి కూపే కారుగా లాంచ్ చేస్తోంది. ఇటీవలే ఈ కారును ఆవిష్కరించింది టాటా మోటార్స్ కంపెనీ. ఆగస్టు 7వ తేదీన ఇండియాలో లాంచ్ కానుంది. ప్రస్తుతం ఇండియాలోని ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో దూసుకుపోతున్న టాటా నెక్సాన్ ఈవీ కంటే మరింత మెరుగ్గా ఉండనుందని తెలుస్తోంది. ఈ కారు లుక్, డిజైన్, ఫీచర్లు అన్నీ ప్రత్యేకంగా ఉండబోతున్నాయి.
భారతీయులకు అత్యంత నమ్మకమైన బ్రాండ్ మారుతి సుజుకి నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ కారు రానుంది. Maruti Suzuki eVX పేరుతో త్వరలో భారతీయ మార్కెట్లో విడుదల కానుంది. ఇటీవల జరిగిన ఆటో ఎక్స్ పోలో ఈ కారును మారుతి సుజుకి కంపెనీ ఆవిష్కరించింది. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది లాంచ్ కావచ్చు. ఈ కారు టాటా, మహీంద్రా అప్ కమింగ్ ఎలక్ట్రిక్ కార్లకు పోటీ కావచ్చని అంచనా ఉంది.
Hyundai Creta EV. మార్కెట్ లో ఎప్పుడొస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్న కారు ఇదే. ఎందుకంటే SUV విభాగంలో మోస్ట్ పాపులర్, అత్యధిక విక్రయాలు నమోదు చేసే కారు హ్యుండయ్ క్రెటా. అందుకే ఈ కారు ఎలక్ట్రిక్ వెర్షన్ అంటే అందరిలో ఆసక్తిగా ఉంది. MID SUV విభాగంలో లాంచ్ కావచ్చని భావిస్తున్న ఈ కారు TATA CURVV EVతో పోటీ పడవచ్చు. వచ్చే ఏడాది ప్రారంభంలో అంటే మొదటి త్రైమాసికంలో లాంచ్ కావచ్చని తెలుస్తోంది.
Mahindra నుంచి లాంచ్ కానున్న మరో ఎలక్ట్రిక్ కారు Mahindra XUV 3XO EV. ఇదొక మోస్ట్ ఎవైటెడ్ కారుగా ఉంది. ఇదొక కాంపాక్ట్ SUV. ఈ ఏడాదే మహీంద్రా కంపెనీ Mahindra XUV 3XO లాంచ్ చేసింది. వచ్చే ఏడాది ఇదే కారు ఎలక్ట్రిక్ వెర్షన్ లాంచ్ చేయనుంది. సింగిల్ రీఛార్జ్ 300 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని అంచనా ఉంది. మార్కెట్లో ఎంట్రీ ఇచ్చాక ఎంజీ కామెట్ ఈవీ, టాటా టియాగో ఈవీ కార్లకు పోటీ ఇవ్వనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook