UPI Transaction: యూపీఐ చెల్లింపులకు పరిమితి రోజుకు ఎంత, ఎన్ని లావాదేవీలు జరపవచ్చు
UPI Transaction: ఆన్లైన్ చెల్లింపులకు సంబంధించి కీలకమైన అప్డేట్ వెలువడింది. వివిధ బ్యాంకుల యూపీఐ లావాదేవీల పరిమితి పెరిగింది. ఆ వివరాలు మీ కోసం..
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ డిజిటల్ పేమెంట్స్‌ను ఇండియాలో నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా సర్వ సాధారణంగా మారిన యూపీఐ చెల్లింపుల పరిమితిని ఏ బ్యాంకుకు ఎంత ఉందో తెలుసుకుందాం..
ప్రస్తుతం ఎక్కడ చూసినా డిజిటల్ చెల్లింపులే కన్పిస్తున్నాయి. బ్యాంకులకు వెళ్లి..నగదు పంపించే పరిస్థితి లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా నగదు పంపించే పరిస్థితి తగ్గిపోయింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన పేమెంట్స్ సిస్టమ్ ..యూపీఐ ఐడీల ద్వారా డబ్బులు పంపించేందుకు, తీసుకునేందుకు అనుమతిస్తుంది.
యూపీఐ పేమెంట్స్ విధానం చాలా వేగంగా ఉంటుంది. క్షణాల్లో లావాదేవీలు జరిగిపోతాయి. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో క్యాష్‌బ్యాక్ ఇతర ఆఫర్లు, రివార్డులు వస్తుంటాయి. అయితే యూపీఐ ద్వారా రోజుకు వివిధ బ్యాంకుల లావాదేవీల పరిమితి ఎంత ఉందనేది చాలామందికి తెలియదు. సాధారణంగా ఎవరైనా వ్యక్తికి రోజుకు లక్షరూపాయల పరిమితి ఉంటుంది. అదే విధంగా లావాదేవీల సంఖ్య అయితే రోజుకు 20 మాత్రమే.
బ్యాంకుల వారీగా యూపీఐ లావాదేవీ పరిమితి
బ్యాంకు పేరు గరిష్ట లావాదేవీ పరిమితి రోజుకు పరిమితి
యాక్సిస్ బ్యాంకు 100,000 100,000
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 10,000 20,000
బ్యాంక్ ఆఫ్ బరోడా 25,000 50,000
కెనరా బ్యాంకు 100,000 100,000
సిటి బ్యాంకు 100,000 100,000
ఫెడరల్ బ్యాంకు 100,000 100,000
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు 100,000 100,000
ఐసీఐసీఐ 10,000 10,000
ఐడీబీఐ బ్యాంకు 25,000 50,000
కోటక్ బ్యాంకు 25,000 50,000
ఎస్బీఐ 100,000 100,000
యూనియన్ బ్యాంకు 100,000 100,000
పంజాబ్ నేషనల్ బ్యాంకు 100,000 100,000
ఎస్ బ్యాంకు 100,000 100,000
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook