UPI Payment Charges 2023: IIT బాంబే సంచలన నివేదిక.. UPI లావాదేవీలపై ఛార్జీలతో ప్రభుత్వానికి రూ.5 వేల కోట్ల ఆదాయం
UPI New Rules 2023: యూపీఐ పేమెంట్స్‌పై ఐఐటీ బాంబే సంచలన నివేదికను విడుదల చేసింది. ప్రతి ట్రాన్సక్షన్‌పై 0.3 శాతం ఛార్జీలు వసూలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. తద్వారా ఏడాదికి రూ.5 వేల కోట్ల ఆదాయం ఏడాదికి సమకూర్చుకోవచ్చని పేర్కొంది.
UPI New Rules 2023: ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే నుంచి యూపీఐ చెల్లింపులపై అదనపు ఛార్జీలు విధించనున్నారనే వార్తలు ఇటీవలె వైరల్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే తాజాగా ఐఐటీ బాంబే ఓ సంచలన నివేదికను రూపొందించింది. యూపీఐ పేమెంట్లపై 0.3 శాతం చొప్పున ఛార్జీ వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. తద్వారా ప్రభుత్వానికి ఏడాది రూ.5 వేల కోట్ల ఆదాయం వస్తుందని నివేదికలో పేర్కొంది. పీపీఐ ఆధారిత యూపీఐ చెల్లింపుల కోసం ఛార్జీలు- ది డిసెప్షన్' పేరుతో నివేదికను రిలీజ్ చేసింది. ఛార్జీలు వసూలు చేయగా వచ్చిన నిధులతో యూపీఐ వ్యవస్థకు అవసరమైన మౌలిక వసతులన్నింటినీ మెరుగుపరుచుకోవచ్చని వెల్లడించింది.
మొబైల్ వాలెట్ల ద్వారా చేసే చెల్లింపులపై 1.1 శాతం ఇంటర్ ఛేంజ్ ఛార్జీలు విధించాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధన అమలు చేస్తోంది. ఉదాహరణకు మీ పేటీఎమ్ వ్యాలెట్ ఉన్న డబ్బులను యూపీఐ ద్వారా చెల్లిస్తే.. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (పీపీఐ) అంటారు. ఈ పీపీఐ ట్రాన్సిక్షన్లకు 1.1 శాతం ఛార్జీలు వసూలు చేయనున్నారు. అది కూడా వినియోగదారుల నుంచి కాకుండా.. వ్యాలెట్ వాళ్ల నుంచి తీసుకోనున్నారు. పీపీఐ పద్ధతిలో రుసుం వసూలు చేస్తే వ్యాపారులపై భారం పడనుందని ఐఐటీ ముంబై నివేదిక వెల్లడించింది.
వినియోగదారులకు అతి స్పల్ప మొత్తంలో ఛార్జీలు విధిస్తే పెద్దగా భారం పడదని.. ఏడాదికి రూ.5 వేల కోట్ల నిధులు సమకూర్చొవచ్చని పేర్కొంది. వ్యవస్థ నిర్వహణకు.. మరింత మెరుగుపరించేందుకు ఉపయోగపడతాయని వెల్లడించింది. ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలించవచ్చని నివేదికలో పేర్కొంది. యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఈ ప్రతిపాదనకు కేంద్ర ఆమోదిస్తే.. వినియోగదారుల నుంచి ఛార్జీలు వసూలు చేయడం ప్రారంభం అవుతుంది. అయితే లోక్‌సభ ఎన్నికలకు ఏడాదే సమయం ఉండడంతో కేంద్రం అప్పుడే నిర్ణయం తీసుకునే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు.
Also Read: తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ భారీ ఓటమి.. రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ
Also Read: IPL Points Table: టాప్‌లేపిన రాజస్థాన్.. హైదరాబాద్ పరిస్థితి దారుణం.. మిగిలిన జట్లు ఇలా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి