Vistara flights tickets offers: రూ.1099కే domestic flights టికెట్ బుకింగ్ ఆఫర్స్
Vistara flights tickets offers: న్యూ ఢిల్లీ: విస్తారా ఎయిర్ లైన్స్ కంపెనీ మరోసారి విస్తారంగా ఆఫర్స్ ప్రకటించింది. కనిష్టంగా రూ.1099 నుంచి టికెట్ బుకింగ్ ఆఫర్స్ అందిస్తున్నట్టు విస్తారా వెల్లడించింది. జూన్ 24న అర్థరాత్రి ప్రారంభమైన ఈ ఆఫర్ టికెట్ సేల్ బుకింగ్ జూన్ 25న అర్థరాత్రి 12 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
Vistara flights tickets offers: న్యూ ఢిల్లీ: విస్తారా ఎయిర్ లైన్స్ కంపెనీ మరోసారి విస్తారంగా ఆఫర్స్ ప్రకటించింది. కనిష్టంగా రూ.1099 నుంచి టికెట్ బుకింగ్ ఆఫర్స్ అందిస్తున్నట్టు విస్తారా వెల్లడించింది. జూన్ 24న అర్థరాత్రి ప్రారంభమైన ఈ ఆఫర్ టికెట్ సేల్ బుకింగ్ జూన్ 25న అర్థరాత్రి 12 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ఈ ఆఫర్ అందుబాటులో ఉండదని విస్తారా ఎయిర్ లైన్స్ తమ ప్రకటనలో పేర్కొంది. మాన్‌సూన్ సేల్ (Vistara flight tickets Monsoon sale offers) పేరిట విస్తారా ఎయిర్ లైన్స్ ఈ ఆఫర్స్ అందిస్తోంది.
అయితే, ఇక్కడ ఓ కిటుకు ఉంది. ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 12 మధ్య ప్రయాణించే వారికి మాత్రమే ఈ ఆఫర్స్ వర్తిస్తాయని విస్తారా స్పష్టంచేసింది. దేశంలోని పలు గమ్యస్థానాలకు వెళ్లే డొమెస్టిక్ విమానాల్లో (Domestic flights) ఎకానమి, ప్రీమియం ఎకానమి, బిజినెస్ క్లాస్.. మొత్తం ఈ మూడు కేటగిరీలకు ఈ ఆఫర్ వర్తింపజేసినట్టు విస్తారా తెలిపింది.
Also read : Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్
విస్తారా అధికారిక వెబ్‌సైట్, iOS యాప్, ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ ద్వారా లేదా విమానాశ్రయాల్లో ఉండే విస్తారా టికెట్ బుకింగ్ ఆఫీసులో (ATO లు), విస్తారా ఎయిర్ లైన్స్ కాల్ సెంటర్ ద్వారా లేదా ట్రావెల్ ఏజెంట్ల ద్వారా ఈ ఆఫర్ టికెట్లను (Flight ticket offers) బుక్ చేసుకోవచ్చు. ఆఫర్ పరిమిత సంఖ్యలో సీట్లకు మాత్రమే వర్తించనున్నందున మొదట బుక్ చేసుకునే వారికే ఆఫర్స్ అందుబాటులో ఉంటుందని విస్తారా ప్రకటించింది.
కరోనావైరస్ సెకండ్ వేవ్ (Corona second wave) కారణంగా కుదేలైన ఎయిర్ లైన్స్ సంస్థలు ఇప్పుడిప్పుడే ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో ప్రయాణికులను ఆకర్షించేందుకు తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అందులో భాగంగానే విస్తారా ఎయిర్ లైన్స్ (Vistara airlines offers) ఈ ఆఫర్స్ ప్రకటించింది.
Also read: EPFO Latest Update: పీఎఫ్ ఖాతా, పెన్షన్ ఫండ్ వేరు చేయాలని యోచిస్తున్న కేంద్రం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook