Vodafone Idea (VI) Launches Rs 549 Prepaid Plan: ప్రముఖ టెలికాం దిగ్గజం వోడాఫోన్ ఐడియా (వీఐ) 5G సేవలు భారతదేశంలో ఇంకా ప్రారంభం కాలేదు. అయితే 5G సేవలను త్వరలో ప్రారంభించాలని కంపెనీ చూస్తోంది. ఈ విషయాన్ని వీఐ త్వరలో అధికారికంగా విడుదల చేయనుంది. అయితే అంతకుముందే వోడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్‌లను తీసుకువచ్చింది. దాంతో తన కస్టమర్లను థ్రిల్ చేయడానికి ప్రయత్నిస్తోంది. 6 నెలల చౌకైన ప్లాన్‌ను వీఐ ప్రారంభించింది. ఇది చాలా అద్భుతమైన ప్లాన్. ఈ ప్లాన్ కేవలం ధర రూ. 549 మాత్రమే. ఈ సరికొత్త ప్లాన్ వివరాలు ఓసారి చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వోడాఫోన్ ఐడియా యొక్క రూ. 549 ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు అందుబాటులో ఉంది. ప్లాన్ యొక్క ప్రత్యేకత 'వాలిడిటీ'. మరింత వాలిడిటీని పొందాలనుకునే మరియు డేటా అవసరం లేని కస్టమర్ల కోసం ఈ ప్లాన్ సరిగ్గా సరిపోతుంది. అయితే ప్రస్తుతం వినియోగదారులు అలవాటు పడిన అపరిమిత ప్రయోజన ప్లాన్ ఇది కాదు. మీరు ఉపయోగించే ప్రతి వాయిస్ కాలింగ్ నిమిషానికి నిర్ణీత రేటును ఛార్జ్ చేసే ప్లాన్ ఇది. కేవలం 1 GB డేటా మాత్రమే ఉంటుంది. 


వోడాఫోన్ ఐడియా యొక్క రూ. 549 ప్లాన్ 180 రోజుల సర్వీస్ వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌తో మొత్తం 1GB డేటా మాత్రమే లభిస్తుంది. అదనపు డేటాను పొందడానికి, డేటా వోచర్‌ల కోసం సభ్యత్వాన్ని పొందాలి. ఈ ఈ ప్లాన్‌లో జాతీయ మరియు లోకల్ కాల్‌లకు సెకనుకు 2.5 పైసలు చొప్పున ఛార్జ్ చేయబడుతుంది. మీరు ఈ ప్లాన్‌లో రూ. 549 టాక్ టైమ్ పొందుతారు. సెకండరీ సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచాలనుకునే వినియోగదారులకు వోడాఫోన్ ఐడియా రూ. 549 ఉత్తమమైనది. వీఐ ఈ ప్లాన్‌ని తన ప్రీపెయిడ్ ఆఫర్ యొక్క చెల్లుబాటు విభాగానికి జోడించింది.


Also Read: Nokia 105 4G 2023: సూపర్ ఫోన్‌ను విడుదల చేసిన నోకియా.. ధర కూడా తక్కువే! బ్యాటరీ అస్సలు అయిపోదు  


Also Read: Anasuya Bharadwaj Pics: అందానికి కేరాఫ్ అడ్రస్ అనసూయ భరద్వాజ్.. చేతులు పైకెత్తి నడుము వంపులు చూపించేస్తుందిగా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.