Mobile users: ప్రముఖ రీసెస్చ్​ సంస్థ ప్రడియో ఆండ్రాయిడ్​ యూజర్లను హెచ్చరించింది. ఈ సైబర్​​ సెక్యూరిటీ సంస్థ.. ఓ ప్రమాదకరమైన యాప్​ను గుర్తించింది. 2ఎఫ్​ఏ అథెంటికేటర్​​ పేరుతో గూగుల్​ ప్లే స్టోర్​లో ఈ యాప్​ ఉన్నట్లు తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ యాప్​ను 10,000 మందికిపైగా యాక్టివ్ యూజర్లు ఉన్నట్లు కూడా తెలిపింది ప్రడియో. ఇదొక ట్రోజన్​-డ్రాపర్ అని గుర్తించింది. దీని ద్వారా హ్యాంకర్లు, సైబర్ క్రిమినసల్స్​ యూజర్ల మొబైళ్లలోకి సీక్రెట్​గా మాల్వేర్​ను పంపించేందుకు ఉపయోగపడుతుందని చెప్పింది.


2ఎఫ్​ఏ అథెంటికేటర్ యాప్​ ద్వారా వెల్టర్​ అనే మాల్వేర్​ మొబైల్ ఫోన్లలోకి ప్రవేశిస్తుందని గుర్తించింది ప్రడియో. ఈ మాల్వేర్​ యూజర్ల ఫోన్లలోని బ్యాంక్​ వివరాలు సహా ఇతర విలువైన సమాచారాన్ని హ్యాకర్లకు చేరవేస్తుందని తెలిపింది.


ప్లే స్టోర్​ నుంచి తొలగింపు..


అయితే 2 ఎఫ్​ఏ అథెంటికేటర్​ యాప్ ఉంటే చాలు.. ఫోన్లలో ఆటోమెక్​గా వెల్టర్ మాల్వేర్ ఇన్​స్టాల్ అవుతుందని తమ రీసెర్చ్​లో తెలినట్లు ప్రడియో పేర్కొంది. ఈ యాప్​ గురించి గూగుల్​కు నోటిఫై చేసినట్లు కూడా వివరిచింది. గూగుల్​ కూడా వెంటనే స్పందించి.. ఆ యాప్​ను ప్లే స్టోర్​ నుంచి తొలగించినట్లు పేర్కొంది.


అయితే ప్లే స్టోర్ నుంచి ఈ యాప్​ను తొలగించినందువల్ల కొత్తగా దానిని ఎవరూ డౌన్​లోడ్ చేసుకోలేరు. ఇప్పటికే డౌన్​లోడ్ చేసుకున్న యూజర్లు మాత్రం వీలైనంత త్వరగా ఆ యాప్​ను తమ ఫోన్ల నుంచి అన్​ఇన్​స్టాల్​ చేయాల్సి ఉంటుంది. లేదంటే సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకునే ప్రమాదముందని హెచ్చరించింది ప్రడియో.


2ఎఫ్​ఏ అథెంటికేటర్​ యాప్ ఎలా పని చేస్తుంది?


ఈ యాప్​ ఇన్​స్టాల్ చేసినప్పుడు.. కొన్ని క్లిష్టమైన పర్మిషన్స్​ అడుగుతుంది.


ఆయితే యూజర్ల నుంచి ఎలాంటి పర్మిషన్స్ కోరతుంది అనే విషయంపై గూగుల్​ ప్లే స్టోర్​లో వివరాలు పొందుపరచలేదు 2ఎఫ్ఏ అథెంటికేటర్​​ యాప్​.


ఈ పర్మీషన్స్​కు తోడు.. యాప్​లో సీక్రెట్​ కోడింగ్​ ద్వారా.. మాల్వేర్​ ఫోన్లో ఇన్​స్టాల్​ అయ్యేందుకు దోహదం చేస్తాయి.


ఇలా సైబర్​ హ్యాకర్లు సులభంగా ఆయాప్ ఉపయోగిస్తున్న వారి ఫోన్లలోకి చేరి.. విలువైన సమాచారాన్ని తెలుసుకుంటారు. దీని ద్వారా ఆర్థిక నేరాలతో పాటు.. ఇనేక ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దిగుతారు హ్యాకర్లు.


Also read: Flipkart iPhone Offers: iPhone 13 Mini ఇతర వేరియంట్లపై ఊహించని డిస్కౌంట్, ఎంతంటే..


Also read: Moto G60 for RS 149: కేవలం రూ.149లకే Moto G60 స్మార్ట్ ఫోన్.. ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook