Whatsapp New Features: ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వాట్సాప్‌ యూజర్ల ముందుకు కొత్తగా రెండు ఫీచర్లను ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం. మెసేజింగ్‌ యాప్‌ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త ఆప్షన్స్‌ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొత్తగా మరో రెండు ప్రధానమైన ఫీచర్లను తీసుకువస్తున్నట్లు టాక్‌. ఈ కొత్త ఫీచర్‌లో గ్రూప్‌లోని వ్యక్తుల అభిప్రాయాలను తెసుకునేందుకు గ్రూప్‌ పోల్స్‌ ఫీచర్‌(Group Polls Feature)ను వినియోగదారులకు పరిచయం చేయనుంది. రెండవ ఫీచర్‌ విషయానికి వస్తే..లాంగ్వేజ్‌ ఫీచర్‌(Language feature)ను తీసుకువస్తున్నట్లు సమాచారం. ఈ సమాచారాన్ని వాబీటాఇన్ఫో వెబ్‌సైట్‌లో తెలిపింది. వాట్సాప్‌ కొత్త ఫీచర్లతో వినియోగదారులను ఎప్పటికప్పుడు ఆకర్షిస్తూనే ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆ రెండు ఫీచర్ల గురించి తెలుసుకుందాం..


పోల్స్‌ ఇన్‌ వాట్సాప్‌ గ్రూప్స్‌


వాబీటాఇన్ఫో ఫీచర్ల గురించి వివరించిన ప్రకారం..ప్రస్తతం అన్ని కంపెనీలు కానీ..ఫ్రెండ్స్‌తో సరదాగ చాట్‌ చేసేందుకు అందరు గ్రూప్స్‌ను ఉపయోగిస్తారు. ఈ గ్రూపుల ద్వారా అన్ని విషయాలను తెలసుకుంటారు. తమకు తెలిసిన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. అయితే ఇదే అంశాలపై గ్రూపుల్లో పోలింగ్‌ నిర్వహించేందుకు వీలుగా  పోల్స్‌ ఫీచర్‌ పనిచేయనుంది. అయితే గ్రూప్‌ చాట్‌లో సందేశాల రూపంలో ఈ పోలింగ్‌ నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ పోల్‌ను తయారు చేయడానికి ముందుగా ఓ ప్రశ్నను రూపొందించాల్సిన అవసరం ఉంటుంది.  ప్రశ్నను రూపొందించిన తరువాత వినియోగదారులు తమ ఓట్లు వేయడానికి మల్టీపుల్‌ ఆప్షన్స్‌ కూడా తయారు చేయాలి. అయితే ఇందులో వినియోగదారుడు ఏదో ఓక సమాధానాన్ని ఎంచుకొని ఓటు వేస్తారు. వినియోగదారుడు సమాధానాలను పెట్టిన తరువాత వాట్సాప్‌ గ్రూప్‌లో ఇతర సభ్యులు ఆ సమాధానాలను చూసేందుకు వీలు లేకుండా  ఎండ్‌ టూ ఎండ్‌ ఇన్‌క్రిప్షన్‌ అనే భద్రతను ప్రవేశపెట్టారు. గ్రూప్‌లో సభ్యులు సెలక్ట్ చేసిన ఆప్షన్‌ను అనుగుణంగా  రిజల్ట్స్ వెలువడతాయి. ప్రస్తుతం ఈ కొత్త ఫీచర్లు అభివృద్ధి దశలో ఉన్నట్లు సమాచారం. ఈ ఆప్షన్స్‌ ను  ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్లకు ముందుగా తీసుకురానున్నట్లు సమాచారం.



లాంగ్వేజ్‌ ఫీచర్‌ ఎంత ప్రయోజనం


మెసేజింగ్‌ యాప్‌లన్ని ప్రస్తుతం ఇంగ్లీష్‌ భాషలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే వాట్సాప్‌ను వినియోగదారులకు అనుగుణంగా పలు భాషలు లాంగ్వేజ్‌ ఫిచర్‌తో  ప్రవేశపెట్టనున్నారు. ఈ ఆప్షన్‌ను మొదట  ఆండ్రాయిడ్‌ 2.22.9.13 వెర్షన్‌ వినియోగదారులకు అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. భాషను మార్చుకునేందుకు మొదట వాట్సాప్‌లో సెట్టింగ్‌లోకెళ్లి వినియోగదారులకు కావాల్సిన లాంగ్వేజ్‌ను ఎంచుకునేలా ఈ ఫీచర్‌ పనిచేయనుంది. 


Also Read: Kieron Pollard Retirement: కిరెన్ పొల్లార్డ్ రిటైర్మెంట్ న్యూస్.. షాక్‌లో పొల్లార్డ్ ఫ్యాన్స్


Also Read: Ram Gopal Varma: రాంగోపాల్ వర్మపై తీవ్ర విమర్శలు చేసిన నిర్మాత నట్టికుమార్..!!


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook