WhatsApp new features: ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ కొత్త ఫీచర్లతో దూసుకెళ్తోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ ఇతర యాప్‌లకు ధీటుగా నిలుస్తోంది. మారుతున్న కాలానికి తగ్గట్లు యాప్‌లో మార్పులు చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. తాజాగా వాట్సాప్‌ నుంచి మరో కొత్త ఫీచర్‌ వస్తున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్‌ గ్రూప్‌ చాటలలో పోల్స్ ఫీచర్ తీసుకువస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వాట్సాప్‌ బీటా ఇన్ఫో స్క్రీన్‌ షాట్స్‌ నెట్టింట్ట హల్​చల్ చేస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాట్సాప్‌ పోల్స్‌ ఎలా పనిచేస్తుందంటే...


మెసేజింగ్ యాప్‌లు టెలిగ్రామ్, ఫేస్‌బుక్‌ మెసేంజర్‌లో ఉన్నట్లుగానే గ్రూప్ పోల్స్ ఫీచర్‌ తీసుకురావాలని వాట్సాప్‌ భావిస్తోందట. ప్రస్తుతం ఈ ఫీచర్‌ డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉందని సమాచారం. త్వరలోనే వాట్సాప్‌ ..ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలున్నాయని వాబీటా ఇన్ఫో పేర్కొంది.


వాట్సాప్‌ గ్రూప్‌ పోల్‌ను క్రియేట్ చేయడానికి ముందు ఓ ప్రశ్నను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత యూజర్లు ఓటు వేయడానికి కొన్ని సమాధానాలు ఇవ్వాలి. గ్రూప్‌లో ఉన్న మెంబర్స్ మాత్రమే పోల్స్, వాటి ఫలితాలు చూడగలుగుతారని వాట్సాప్‌ తెలిపింది.


మెంబర్లు సెలక్ట్ చేసిన ఆప్షన్‌ను బట్టి పోల్ రిజల్ట్స్‌ వస్తాయి. ఐతే గ్రూప్ అడ్మిన్‌లు పోల్ ఆప్షన్‌లను సవరించగలరా..లేదా ..పోలింగ్‌కు టైం లిమిట్‌ ఉంటుందా అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


Also read: Flipkart Samsung TV: రూ.21 వేల విలువైన శాంసంగ్ స్మార్ట్ టీవీని రూ.6 వేలకే కొనేయండి!


Also read: LIC IPO: ఎల్‌ఐసీ ఐపీఓకి సెబీ గ్రీన్‌ సిగ్నల్‌... కేవలం 22 రోజుల్లోనే అనుమతి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook