Work From Home: వారంలో రెండు రోజులు ఆఫీస్‌కు రావాలి: విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్ జీ
ప్రముఖ ఐటీ సంస్థ విప్రో.. ఉద్యోగులను రేపటి నుంచి కార్యాలయాలకు తిరిగి రావాలని ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులు వారంలో రెండు రోజులు కార్యాలయం నుంచి పనిచేస్తారని పేర్కొంది. విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్ జీ ఈమేరకు ట్వీట్ చేశారు.
Work From Home: కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం, మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతుండటంతో.. ఆయా సంస్థలు తమ ఉద్యోగులను కార్యాలయాలకు పిలిచే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఐటీ సంస్థ ‘విప్రో(Wipro)’.. తన ఉద్యోగులను సోమవారం నుంచి కార్యాలయాలకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. రెండు డోసులు పూర్తయిన వారిని విధులకు అనుమతించనుంది. హైబ్రిడ్ మోడల్ వర్క్ విధానంలో.. ప్రస్తుతానికి వారానికి రెండు రోజులు ఆఫీస్(Office) నుంచి పని చేయాలని సూచించింది. ఈ మేరకు సంస్థ ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ(Rishad Premji) ఆదివారం ఓ ట్వీట్ చేశారు.
‘18 నెలల అనంతరం.. మా ఉద్యోగులు సోమవారం నుంచి వారానికి రెండు రోజులపాటు ఆఫీస్‌కు రానున్నారు. రెండు డోసుల టీకా పూర్తయినవారు.. సురక్షితంగా వచ్చి వెళ్లేలా, వ్యక్తిగత దూరం పాటించేలా ఏర్పాట్లు చేశాం. ఈ ప్రక్రియను నిశితంగా పరిశీలిస్తాం’ అని పేర్కొన్నారు. కార్యాలయాల ప్రాంగణంలో పాటించాల్సిన నిబంధనలు, కొవిడ్ సేఫ్టీ ప్రొటోకాల్స్‌పై రూపొందించిన వీడియోనూ జతపరిచారు. జులైనాటికి విప్రో ఉద్యోగుల్లో(Wipro Employees) దాదాపు 55 శాతం మంది వ్యాక్సిన్ వేయించుకున్నట్లు రిషద్ ప్రేమ్‌జీ ఇటీవల నిర్వహించిన సంస్థ వార్షిక సమావేశంలో వెల్లడించారు. ఈ సంస్థకు ప్రస్తుతం రెండు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.
Also Read: Tesla Cars: ఇండియాలో టెస్లా కారు వస్తుందా లేదా, ప్రభుత్వం విధించిన షరతేంటి
హైబ్రిడ్ మోడల్ వర్క్ విధానంలో..
కరోనా వ్యాప్తి మొదలు ప్రముఖ సాఫ్ట్‌వేర్, ఇతర సంస్థలు తమ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రం హోం(Work from home)’ ఇచ్చిన విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా క్రమంగా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో కార్యాలయాలకు పిలుస్తున్నాయి. మరోవైపు మూడో వేవ్ పొంచి ఉందనే వార్తల నేపథ్యంలో.. కొన్ని సంస్థలు వేచి చూద్దామనే ధోరణిలో ఉన్నాయి. మరికొన్ని హైబ్రిడ్ మోడల్ వర్క్(hybrid model Work) విధానాన్ని అవలంబిస్తున్నాయి. ఈ విధానంలో.. ఉద్యోగులు అవసరమైనప్పుడు ఆఫీస్ నుంచి లేదా ఇంటినుంచి పని చేసుకోవచ్చు. ఈ విధానంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని, మరింత ఉద్యోగ కల్పనకు అవకాశం దక్కుతుందని పారిశ్రామిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook