Investment strategies for girl child: రూ. 4 వేలు పెట్టుబడి పెడితే రూ. 22 లక్షలు! మీ అమ్మాయి కోసం ఈ ప్రత్యేక పథకం..
Investment strategies for girl child: ప్రతి తల్లిదండ్రులు తన పాపాయి బంగారు భవిష్యత్తు కోసం పెట్టుబడి ప్రణాలికలు వేసుకుంటారు. ఇవి వారి చదువు, పెళ్లి ఖర్చులకు ఎంతగానో ఉపయోగపడతాయని వారి ప్రధాన ఉద్దేశం.
Investment strategies for girl child: ప్రతి తల్లిదండ్రులు తన పాపాయి బంగారు భవిష్యత్తు కోసం పెట్టుబడి ప్రణాలికలు వేసుకుంటారు. ఇవి వారి చదువు, పెళ్లి ఖర్చులకు ఎంతగానో ఉపయోగపడతాయని వారి ప్రధాన ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజనకు ఇచ్చే వడ్డీ రేటును పెంచింది. ఇంతకుముందు ఈ పథకంలో పెట్టుబడిపై 8% వడ్డీని ఇవ్వగా, ఇప్పుడు 8.2%కి పెరిగింది. ఈ పథకంలో ఏడాదికి కనీసం రూ. 250 నుంచి గరిష్టంగా రూ. 1.5 లక్షలు పెట్టుబడి పెట్టొచ్చు. దీర్ఘకాల పెట్టుబడి కారణంగా సుకన్య సమృద్ధి యోజన నుండి ఎక్కువ మొత్తాన్ని సేకరించడం ఈ పథకం ప్రత్యేకత.
అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ పథకం కింద కుమార్తెకు 10 ఏళ్లు నిండే వరకు మాత్రమే సుకన్య సమృద్ధి ఖాతా తెరుస్తారు . ఈ ఖాతా 21 సంవత్సరాలలో మెచ్యూర్ అవుతుంది. అయితే, మీ కుమార్తెకు 18 సంవత్సరాలు నిండినప్పుడు, విద్య లేదా వివాహం కోసం అప్పటి వరకూ పొదుపు చేసిన నగదులో 50 శాతం డ్రా చేసుకునే అవకాశముంటుంది.
ఉదాహరణకు మీరు ఈ ప్లాన్‌లో ప్రతి నెలా 4 వేల రూపాయలు ఆదా చేసుకోవాలి. ఈ లెక్క ప్రకారం మీరు 2024లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించారనుకోండి. మీ కుమార్తెకు 5 సంవత్సరాల వయస్సు ఉంటే, మొత్తం ఫండ్ లెక్కిస్తారు. సెక్షన్ 80సి కింద ఏడాదికి 1.5 లక్షల వరకూ ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. ఈ పథకంపై వచ్చే రిటర్న్స్ కూడా ట్యాక్స్ మినహాయింపుతో ఉంటాయి. మెచ్యూరిటీ నగదుపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు.
ఒకవేల మీరు నెలకు 4,000 పొదుపు చేస్తే ఏడాదిలో రూ.48,000. పెట్టుబడి పెట్టగల సామర్థ్యం ఉంటుంది. ఈవిధంగా 15 ఏళ్లపాటు ఖాతాలో డబ్బు జమ చేయాలి. 2042 నాటికి ఈ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా సుకన్య సమృద్ధి యోజనలో 7 లక్షల 20 వేల రూపాయలు సమకూరుతాయి.
21 ఏళ్ల మెచ్యూరిటీ తర్వాత అంటే 2045లో రూ.15 లక్షల 14 వేల వడ్డీ మాత్రమే లభిస్తుంది. అంటే 7.20 లక్షల పెట్టుబడిపై 15.14 లక్షల వడ్డీని పొందవచ్చు. మెచ్యూరిటీ సమయంలో మీరు పెట్టుబడి మొత్తం, దానిపై వడ్డీ మొత్తాన్ని కలిపితే, మీకు మొత్తం 22 లక్షల 34 వేల రూపాయలు వస్తాయి. మీ అమ్మాయికి 21 ఏళ్లు నిండాక చేతికి అందుతుంది. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం జ్యోతిష్కులు గ్రహ సంచారం ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)
ఇదీ చదవండి: Hair Oiling Tips: ఇలా నూనె రాసుకుంటే జుట్టు రాలడం ఖాయం! హెయిర్ ఆయిల్ పెట్టుకునే విధానం ఇలా ఉండాలి..
ఇదీ చదవండి: Side Effect of Paper Cup: మీరూ పేపర్ కప్పులో టీ తాగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook