Worlds Expensive Car: ఈ కారు డబ్బులతో 200 విల్లాస్ లేదా 3 వేల కార్లు కొనేయవచ్చు
Worlds Expensive Car: ప్రపంచమంతా లగ్జరీ వైపు పరుగులెడుతోంది. అవసరానికి మించిన లగ్జరీ. వాచ్‌లు, స్మార్ట్ఫోన్లు, ఫ్లాట్లు, కార్లు ఇలా ఒకటేమిటి అన్నింట్లో లగ్జరీ ఉండాల్సిందే. అయితే ఇవన్నీ కోటీశ్వరులకు మాత్రమే సుమా. కానీ ఈ కారు మాత్రం కోటీశ్వరులకు కూడా కాదు..అంతకుమించినోళ్లకు..
Worlds Expensive Car: ప్రపంచంలో ఇప్పటికే అత్యంత ఖరీదైన కార్లు చాలానే ఉన్నాయి. వీటి ధర కోట్లలో ఉంటుంది. కోటీశ్వరులకు మించినోళ్లే కొనగలిగే కార్లు ఇవి. లగ్జరీను బట్టి కారు విలువ మారిపోతుంటుంది. బ్రాండ్, లగ్జరీ, సౌకర్యాలను బట్టి ధర మారుతుంటుంది. ఇప్పుడీ జాబితాలో మరో అత్యంత ఆధునిక, విలాసవంతమైన కారు వచ్చి చేరింది. ఈ కారు ధర వింటే కళ్లు తేలేయాల్సిందే.
ప్రపంచంలోని అత్యంత ఖరీదైన, విలాసవంతమైన కార్లలో సరికొత్తగా ఈ కారు వచ్చి చేరింది. చేరడమే కాదు ఏకంగా జాబితాలో మొదటి స్థానంలో వచ్చేసింది. సౌకర్యాల సంగతేమో గానీ ధర అంత ఉంది మరి. మీ అంచనాలకు అందని ధర అది. ఈ ధరతో 10 లక్షల సాధారణ బడ్జెట్ కార్లు ఏకంగా 2500 కొనుగోలు చేయవచ్చు. నమ్మలేకున్నారా..నిజమే మరి. ఇప్పుడీ కారే ప్రపంచంలోనే అత్యంత విలువైన కారుగా ఉంది. లగ్జరీ కార్లకు ప్రసిద్ధి చెందిన రోల్స్ రాయిస్ కంపెనీ లాంచ్ చేసింది. రోల్స్ రాయిస్ డ్రాప్ టెయిల్‌లో మూడవ వేరియంట్ ఇది. ఈ కారు పేరు Rolls Royce Arcadia Droptail.
Rolls Royce Arcadia Droptail చూస్తుంటే తెగ ముద్దొస్తుంది. చాలా ఆకర్షణీయమైన లుక్‌తో అందర్నీ ఇట్టే ఆకట్టుకుంటోంది. ఇది కేవలం టూ సీటర్ కారు. ఇదొక ట్విన్ టర్బో ఛార్జ్డ్ 6.75 లీటర్ వి12 ఇంజన్‌తో వస్తోంది. ఈ కారు 601 హెచ్‌పి పవర్, 841 ఎన్ఎం టార్క్ జనరేట్ చేయగల సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఈ కారును పెయింట్ చేసేందుకు సహజసిద్ధమైన డ్యూవోటోన్ అభివృద్ధి చేశారు. ఈ కారు బాడీ కలర్ ప్యూర్ వైట్.
ఈ కారుకు ఉపయోగించిన తెలుపు రంగులో అల్యూమినియం, గ్లాసు భాగాలు కలిసుంటాయి. ఈ కారును తయారు చేసేందుకు రోల్స్ రాయిస్ కంపెనీ 233 కలప ముక్కల్ని ఉపయోగించింది. ఈ కారు తయారీకు 8 వేల గంటల సమయం పట్టింది. డ్యాష్‌బోర్డ్‌లో రోల్స్ రాయిస్ సెల్ఫ్ డిజైన్ వాచ్ ఉంటుంది. డ్యాష్‌బోర్డ్ అత్యంత క్లిష్టమైన విభాగంగా చెబుతున్నారు. ఎందుకంటే ఈ కారు డ్యాష్‌బోర్డ్ తయారీకు రెండేళ్లపాటు రీసెర్చ్ చేశారట.
ఇప్పుడిక అసలు విషయానికొద్దాం. ఈ కారు ధర ఎంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే. లక్షాధికారి కాదు కదా కోటీశ్వరుడు కూడా కొనలేడు. అంతకుమించినోడైతేనే కొనగలడు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కార్లలో మొదటి స్థానంలో నిలిచిన Rolls Royce Arcadia Droptail ధర 31 మిలియన్ డాలర్లు. అంటే అక్షరాలా 257 కోట్లు. నమ్మలేకున్నా ఇదే నిజం. ఇప్పుడిదే అత్యంత ఖరీదైన కారు. ఇంతకుముందు రోల్స్ రాయిస్ కంపెనీకు చెందిన లా రోజ్ నోయర్ డ్రాప్ టెయిల్ అత్యంత ఖరీదైన కారుగా ఉండేది. ఈ కారు ధర 249.48 కోట్లు. మూడో స్థానంలో ఉన్న కారు కూడా రోల్స్ రాయిస్ కంపెనీదే. రోల్స్ రాయిస్ బోట్ టేల్ ధర 233.28 కోట్లు.
Rolls Royce Arcadia Droptail కారు ధరతో సాధారణ 10 లక్షల బడ్జెట్ కార్లు 2500 కొనవచ్చు. లేదా విల్లాలు 200 వరకూ కొనిపడేయొచ్చు. అందుకే ఇది కోటీశ్వరుల వల్ల కూడా కాని పని. అంతకుమించి బలిసినోళ్లకే.
Also read: Xiaomi 14: డబుల్ సెల్ఫీ కెమేరాతో Xiaomi 14 Civi ఎంట్రీ ఇచ్చేసింది, ధర ఎంతంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook