Xiaomi 12 Pro 5G Review: Xiaomi కంపెనీకి చెందిన మరో కొత్త వేరియంట్ Xiaomi 12 Pro 5G ఇప్పుడు భారత విపణిలోకి అందుబాటులోకి వచ్చింది. గత వారం భారత మార్కెట్లో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉంది. Xiaomi 12 Pro 5G ఆరంభ సేల్ లో భాగంగా దీనిపై రూ. 4 వేల తగ్గింపుతో పాటు మరో రూ. 6 వేలను అదనంగా పొందేందుకు అవకాశం ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Xiaomi 12 Pro 5G ఆఫర్స్..


Xiaomi 12 Pro 5G స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం భారత్ లో అమ్మకాలను జరుపుకొంటోంది. ఈ మొబైల్ కు సంబంధించిన 8GB + 256GB వేరియంట్ ధర రూ. 62,999 ఉండగా.. మరో 12GB + 256GB స్టోరేజ్ కలిగిన వేరియంట్ ను రూ. 66,999 ధరకు విక్రయిస్తున్నారు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు కూపన్ ద్వారా రూ. 4 వేలు తగ్గింపును పొందడం సహా ICICI బ్యాంకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో చెల్లించడం ద్వారా అదనంగా మరో రూ. 6 వేలు ఆదా చేసుకోవ్చు. 


ఇలా కూపన్ కోడ్, బ్యాంకు ఆఫర్లతో కలుపుకొని.. ఈ స్మార్ట్ ఫోన్స్ వరుసగా రూ. 52,999, రూ. 56,999కి కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. ఇప్పుడు Xiaomi 12 Pro 5G స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం. 


Xiaomi 12 Pro 5G ఫీచర్స్..


రిజల్యూషన్ - 3200 × 1440 పిక్సెల్స్


డిస్ ప్లే - 6.73 Inch 2K AMOLED 


రిఫ్రెష్ రేట్ - 120 Hz


ప్రాసెరర్ - Qualcomm Snapdragon 8 Gen 1 SoC 


స్టోరేజ్ - 8GB + 256GB, 12GB + 256GB. 


కెమెరా - 50 MP (ప్రైమరీ కెమెరా), 50 MP (ఆల్ట్రా - వైడ్ యాంగిల్ లెన్స్), 32 MP (సెల్ఫీ కెమెరా). 


బ్యాటరీ బ్యాకప్ - 4,600mAh (120W ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్) 


Also Read: BSNL 797 Plan: బీఎస్‌ఎన్‌ఎల్ రూ. 797 రీఛార్జ్ ప్లాన్.. 395 రోజుల వ్యాలిడిటీతో..!


Also Read: Flipkart Big Saving Days Sale: 70 వేల ఏసీపై భారీ డిస్కౌంట్, 32 వేలకే వోల్టాస్ ఇన్వర్టర్ ఏసీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook