Xiaomi 12 Ultra: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థ షియోమీ.. మరో క్రేజీ స్మార్ట్​ఫోన్​ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. చైనాలో గత ఏడాది డిసెంబర్​లో ఆవిష్కరించిన షియోమీ 12 సిరీస్​కు కొనసాగింపుగా ఈ ఫోన్​ను తీసుకురానుందట కంపెనీ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

12 సరీస్​లోని ఫోన్లు..


గత ఏడాది ఈ సిరీస్​లో షియోమీ 12, షియోమీ 12 ప్రో, షియోమీ 12 ఎక్స్​ వంటి వేరియంట్లు విడుదలయ్యాయి. ఇప్పుడు 'షియోమీ 12 అల్ట్రా' పేరుతో కొత్త వేరియంట్ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఉన్న వివరాల ప్రకారం.. ఫిబ్రవరిలో చైనాలోనే తొలుత ఈ స్మార్ట్​ఫోన్​ విడుదల (Xiaomi 12 Ultra release date) కానుంది.


అయితే ఈ కొత్త స్మార్ట్​ఫోన్​ విడుదలకు ముందే కొన్ని ఫీచర్లు ఇంటర్నెట్​లో (Xiaomi 12 Ultra specs in online) లీకయ్యాయి.


లీకైన సమాచారంలో ఏమందుంటే..


భారీ రియర్​ కెమెరాతో ఈ ఫోన్ రానున్నట్లు ఇంటర్నెంట్​లో వార్తలు హల్​చల్​ చేస్తున్నాయి.


షియోమీ 12 అల్ట్రా మోడల్​లో క్వార్డ్​ కెమెరా సెటప్ ఉండొచ్చని తెలుస్తోంది. లెయికా కెమెరాల మోడల్​తో ఇది రానున్నట్లు (Xiaomi 12 Ultra Cameras) తెలిసింది.


ఇందులో 5x పెరిస్కోప్​ లెన్స్​ ఉండనున్నట్లు సమాచారం. ఈ లెన్స్​ హై ఆప్టికల్ జూమ్​ కోసం ఉపయోగపడునుంది. ఈ ఫీచర్​ ఉండటం నిజమేతే.. ఈ లెన్స్​తో రానున్న తొలి స్మార్ట్​ఫోన్​ ఇదే కానుంది. ఎందుకంటే.. ప్రస్తుతం వన్‌ప్లస్ 10 ప్రో స్మార్ట్​ఫోన్​లో అత్యధికంగా 3.3x ఆప్టికల్ జూమ్ ఉంది.


ఇక ముందు వైపు పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా ఉండనుందట. రియర్​ కెమెరా రౌండ్ షేప్​లో ఉండనున్నట్లు తెలుస్తోంది.


ఇక 6.6 అంగుళాల అమోల్డ్​ 2కే, స్పోర్ట్​ కర్వ్​డ్​ డిస్​ప్లేతో ఈ ఫోన్​లో అందుబాటులోకి రానుందంట.


క్వాల్కమ్ 8 జెన్​ ప్రాసెసర్​తో ఈ ఫోన్​ రానుంది. ఈ విషయంపై మాత్రం కంపెనీ అధికారిక ప్రకటన చేసింది.


మరి ఈ ఫోన్ ధర ఎంత ఉండనుంది? ఇంకా ఎలాంటి క్రేజీ ఫీచర్లను ఇందులో పొందు పరిచారు అనే విషయం తెలియాలంటే.. కంపెనీ నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే.


Also read: Todays Gold Rate: పెరిగిన బంగారం, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా


Also read: IT refunds AY22: రూ.1.59 కోట్ల ఐటీ రీఫండ్స్​ చెల్లింపు పూర్తి.. మీకూ వచ్చిందో తెలుసుకోండిలా..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook